ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక మీమ్ వైరల్ అయింది. ఆర్ఆర్ఆర్ సినిమాను స్పేస్‌లో రిలీజ్ చేయడం కోసం అక్కడికెళ్లి చిత్ర బృందం ప్రమోషన్లు చేస్తుండగా.. అక్కడున్న ఒక ఏలియన్‌తో దాని భాషలో తారక్ మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ క్రియేట్ చేశారు. జపాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల కోసం వెళ్లి అక్కడ జపనీస్ భాషలో చక్కగా మాట్లాడ్డం చూసి తారక్ మీద ఈ మీమ్ క్రియేట్ చేశారు నెటిజన్లు.
ఆర్ఆర్ఆర్‌ను ఇండియాలో ప్రమోట్ చేసినపుడు ముంబయికెళ్లి హిందీలో, చెన్నైకి వెళ్లి తమిళంలో, అలాగే కర్ణాటకకు వెళ్లి కన్నడలో తారక్ ఎంత బాగా మాట్లాడాడో అందరూ చూశారు. ఎన్టీఆర్ ఏకసంతాగ్రాహి, బహు భాషా నైపుణ్య ఉన్నవాడని ముందు నుంచే అందరికీ తెలుసు. ఇప్పుడు అతడి నైపుణ్యం అందరికీ మరింత బాగా అర్థమవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ల టైంలోనే కన్నడలో చాలా చక్కగా మాట్లాడి ఆశ్చర్యపరిచాడు తారక్.
ఇక మంగళవారం కర్ణాటక దినోత్సవం సందర్భంగా దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రదానం చేసిన కార్యక్రమానికి రజినీతో కలిసి విశిష్ట అతిథిగా వెళ్లాడు తారక్. అందరూ అనుకున్నట్లే తారక్ ఈ వేడుకలో కన్నడలో చక్కటి ప్రసంగం చేశాడు. పునీత్ అభిమానులను ఉద్వేగానికి గురి చేసేలా, కన్నడిగులందరూ మెచ్చేలా అతడి ప్రసంగం సాగింది. రజినీకి సైతం కన్నడ తెలుసు కాబట్టి ఆయన కూడా ఆ భాషలోనే మాట్లాడాడు. కానీ తారక్ వాక్చాతుర్యం సంగతి తెలిసిందే కాబట్టి అతను తనదైన శైలిలో ప్రసంగించి ఆకట్టుకున్నాడు.
ఐతే తారక్ గురించి అందరికీ తెలిసిందే కాబట్టి ఈ ప్రసంగం చూసి ఎవ్వరికీ ఆశ్చర్యం అయితే కలగట్లేదు. అందరూ తన మీద పెట్టుకున్న అంచనాలను తారక్ అందుకున్నాడంతే. తారక్ తల్లి కన్నడిగురాలే కావడంతో అతడికి ఈ భాష మీద మరింత పట్టు ఏర్పడింది.
This post was last modified on November 2, 2022 11:05 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…