Movie News

పాన్ ఇండియా హిట్ …ఆ సినిమాకు కలిసొచ్చినట్టే !

ఈ మధ్య చిన్న, పెద్ద అనే బేరియర్స్ లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో సౌత్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా నార్త్ లో సౌత్ సినిమాలకు దక్కుతున్న రెస్పాన్స్ , అందుకుంటున్న కలెక్షన్స్ చూస్తే ఔరా అనిపించకమానదు. నిఖిల్ హీరోగా చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 తెలుగులో చిన్న సినిమాగా రిలీజై హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. దీంతో సినిమా అవలీలగా 100 కోట్ల మార్క్ దాటేసింది. నిఖిల్ కి అక్కడ మంచి ఇమేజ్ పాటు మార్కెట్ క్రియేట్ చేసింది.

ఇక నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘కార్తికేయ 2′ ను చూపిస్తూ ఇప్పుడు ’18 పేజెస్’ ను భారీ రేటుకి విక్రయించే పనిలో ఉన్నారు గీతా ఆర్ట్స్. సుకుమార్ కథతో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కింది. గ్యాపులు గ్యాపులుగా సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇటివల ఫైనల్ షెడ్యుల్ మొదలు పెట్టారు. వీలైనంత త్వరగా ఫస్ట్ కాపీ రెడీ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.

అయితే కార్తికేయ 2 ఊహించని సక్సెస్ 18 పేజెస్ కి డిమాండ్ తెచ్చిపెట్టింది. కార్తికేయ 2 లో నటించిన అనుపమనే ఇందులో కూడా హీరోయిన్ కావడంతో నార్త్ లో ఆ సినిమా ఫేం అని చెప్పి భారీ రేటుకి అమ్మే పనిలో ఉన్నాడట బన్నీ వాస్. ఇప్పటికే నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది. తెలుగు , హిందీ శాటిలైట్ అమ్ముడైపోయాయి. తెలుగు సాటిలైట్ , డిజిటల్ రైట్స కలిపి జీ సంస్థ కొనుగోలు చేసేసింది. ఇక మిగిలింది థియేటర్ బిజినెస్ మాత్రమే. కొన్ని ఏరియాల్లో గీతా ఆర్ట్స్ సంస్థే సొంతంగా రిలీజ్ చేయబోతుంది. ఏదేమైనా కార్తికేయ 2 సక్సెస్ 18 పేజెస్ కి బాగా కలిసొచ్చింది. మరి ఈ సినిమాతో నిఖిల్ ఇంకో బ్లాక్ బస్టర్ కొడితే మోస్ట్ సక్సెస్ ఫుల్ యంగ్ హీరోగా దూసుకెళ్ళిపోతాడు.

This post was last modified on November 1, 2022 10:17 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

6 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

6 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

8 hours ago