ఏదేమైనా కూడా బాలీవుడ్ భామలకు ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి అనే విషయంలో ఉన్నంత క్లారిటీ మనోళ్లకు లేదనే చెప్పాలి. ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుందంటే.. కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ తమ అందచందాలతో ప్రతీ ప్రెస్ మీట్లో బాగా ఆకట్టుకుంటారు. తెరపై చేసింది ఒక సాధారణ యువతి పాత్రే అయినా కూడా, మీడియా సమావేశాలకు మాత్రం ఘాటైన లుక్స్ తో విచ్చేస్తారు. ఆ తరువాత.. ఈ అందానికి తమ తెలివిని కూడా బాగా యాడ్ చేస్తారు. మీకింకా సందేహం ఉంటే.. ఒక్కసారి జాన్వి కపూర్ దగ్గరకు వెళ్ళొద్దాం రండి.
తన కొత్త సినిమా ‘మిలి’ ప్రమోషన్లలో బిజీగా ఉంది జాన్వి. ఓ నెల క్రితం ‘గుడ్ లక్ జెర్రి’ సినిమాను ప్రమోట్ చేయడానికి వెస్ట్రన్ దుస్తుల్లో హంగామా చేసిన ఈ సుందరి.. ఇప్పుడు చీరకట్టులో చూడీదారుల్లో గ్లామరస్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. అదంతా ఒకెత్తయితే.. ప్రతీ ఇంటర్యూలోనే సౌత్ సినిమాల గురించి.. తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని, జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని ఉందని.. అడగకుండానే సెలవిస్తోంది. ఇక ఎన్టీఆర్ అండ్ బన్నీ పేర్లు చెప్పిన వెంటనే అమ్మడు ట్రెండింగ్ లోకి వచ్చేస్తోందంతే. దానితో త్వరలో తెలుగు సినిమా చేస్తుందేమో అనే ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చేస్తున్నాయి. నిజానికి ఒక్క సౌత్ సినిమాను కూడా సైన్ చెయ్యని జాన్వి, కేవలం సినిమా ప్రమోషన్ల సమయంలో మాత్రం ఇలా తెలుగు సినిమాల గురించి, తమిళ సినిమా గురించి మాట్లాడుతుంటే.. అది కేవలం అటెన్షన్ కోసమేనని అర్ధంచేసుకోవడానికి పెద్దగా టైమ్ పట్టదులే.
ఒక ప్రక్కన సౌత్ స్టార్ల పేర్లు చెప్పేసి హైప్ తెస్తూ.. మరో ప్రక్కన సౌత్ సినిమాల రీమేక్ లతోనే అమ్మడు వరుసగా తన ఫ్యాన్స్ కు ఎంటర్టయిన్మెంట్ అందిస్తోంది. మొన్న వచ్చిన గుడ్ లక జెర్రీ.. ఓటిటిలోనే విడుదలైంది కాని.. ఆ సినిమా నయనతార ‘కొలమావు కోకిల’ రీమేక్. అలాగే ఇప్పుడు ధియేటర్లకు రాబోతున్న ‘మిలి’ సినిమా కూడా.. మలయాళం సినిమా ‘హెలెన్’ రీమేక్. అది సంగతి.
This post was last modified on November 1, 2022 10:16 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌నో పొగిడితేనో..…