Movie News

సమంత యశోదకు సింపతీ వేవ్ పనిచేస్తుందా?

ఒక్కో సినిమా పబ్లిసిటీకి ఒక్కో విషయం సాయపడుతుంటుంది. కొన్ని సినిమాలకు ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో హీరోలూ స్టార్ గెస్టులూ మాట్లాడే స్పీచ్ ఎక్కడలేని బజ్ తెచ్చిపెడుతుంది. కొన్ని సినిమాలకు వెరైటీగా ప్రమోషన్లు చేయడం కారణంగా చాలా అటెన్షన్ వస్తుంది. అయితే కొన్ని సినిమాలకు మాత్రం హీరో మీదున్న నెగెటివ్ వేవ్ కారణంగా.. ఆ సినిమాలు బాగున్నా కూడా ఆడవు. కొన్నిసార్లు మాత్రం.. సదరు స్టార్ మీదున్న సింపతీ వేవ్ కారణంతో.. సినిమాలు ఆడే ఛాన్సుంది కూడా. ఇప్పుడు ఇలాంటి సింపతీ సమంత కొత్త సినిమాకు ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది ఒక ఆసక్తికరమైన టాపిక్ గా మారింది.

నిజానికి సమంత ప్రమోట్ చేస్తే కాని ”యశోద” సినిమాకు హైప్ రాదని అందరూ అనుకున్నారు కాని, మొన్న రిలీజైన ట్రైలర్ తో మాంచి బజ్ వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా విజువల్స్, కాన్సెప్ట్ అలాగే సౌండ్ డిజైన్ చాలా బాగుండటంతో సినిమాకు చాలా హైప్ వచ్చేసింది. అయితే సమంత తన సినిమాలను చాలా రెట్టించిన ఉత్సాహంతో సోషల్ మీడియాలో అతి బీభత్సంగా ప్రమోట్ చేస్తుంటుంది. ఈసారెందుకు సైలెంటుగా ఉందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న తరుణంలో.. తనకు మయోసైటిస్ వ్యాధి సోకిందని.. అందుకే బయటకు రాలేకపోతున్నాను అన్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టేసి తన అభిమానులను తీవ్రమైన ఆందోళనలోకి నెట్టిసింది సమంత. కాకపోతే ఆ తరువాత చాలామంది సెలబ్రిటీల దగ్గర నుండి త్వరగా కోలుకోమంటూ మెసేజులు రావడంతో.. సమంత హెల్త్ కండీషన్ మాత్రమే కాకుండా, ఆమె సినిమాకు కూడా బాగా హైప్ వచ్చేసింది.

అయితే ఇప్పుడున్న బాక్సాఫీస్ స్థితిగతులు చూసుకుంటే.. సినిమాకు చాలా అద్భుతమైన టాక్ వస్తేగాని ఆడియన్స్ ధియేటర్లకు రావట్లేదు. ఈ సమయంలో యశోద సినిమాకు సింపతీ వేవ్ కారణంగా తొలి రోజున ధియేటర్లకు ప్రేక్షకులు భారీ స్థాయిలో వచ్చే ఆస్కారమున్నా కూడా.. ఆ తరువాత నుండి మాత్రం టాక్ అనేదే చాలా ముఖ్యమైనది. ఒకవేళ సింపతీ వేవ్ కారణంతో సినిమా యావరేజ్ గా ఉన్నా ఆడేసిందంటే మాత్రం.. సమంత తన కెరియర్లో కేవలం ఇనస్టాగ్రామ్ ఫాలోవర్లనే కాకుండా నిజంగానే కోట్లమంది అభిమానాన్ని సంపాదించినట్లే.

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

2 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

7 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

9 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

9 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

11 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

13 hours ago