పూజా హెగ్డేతో ముద్దు ఎవరైనా వద్దు అంటారా? కానీ టాలీవుడ్ యువ కథానాయకుడు అడివి శేష్ మాత్రం అందుకు ‘నో’ అనే అంటున్నాడు. అలా అని పూజా ఏమీ అతడికి ముద్దిస్తా అని అనలేదు. ఏదైనా సినిమా కోసం ఆమెతో లిప్ లాక్ చేయాలని ఏ దర్శకుడూ అతడికి కండిషన్ పెట్టలేదు.
నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో హోస్ట్ చేసే ‘అన్‌స్టాపబుల్’ షో రెండో సీజన్లో కొత్త ఎపిసోడ్‌కు శర్వానంద్‌తో కలిసి అతిథిగా హాజరైన శేష్‌కు బాలయ్య నుంచే ఒక కొంటె ప్రశ్న ఎదురైంది. ఏ హీరోయిన్‌తో కిస్ వద్దురా బాబూ అని నీకు అనిపిస్తుంది అని బాలయ్య అడగ్గా.. పూజా హెగ్డే అని బదులిచ్చి పెద్ద షాకిచ్చాడు శేష్. అయినా ఈ టాప్ హీరోయిన్‌తో ముద్దు వద్దని అంత బలంగా శేష్ ఎందుకు ఫిక్సయ్యాడో ఏంటో మరి. త్వరలోనే ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో ఇలాంటి కొంటె ముచ్చట్లు చాలానే ఉన్నాయి.
ఇంట్లో వాళ్లు పెళ్లి గురించి సతాయించేస్తున్నారని.. టాలీవుడ్లో శర్వానంద్, ప్రభాస్ లాంటి పెద్దవాళ్లు ఇంకా పెళ్లి చేసుకోకుండా తాను ఏం చేసుకుంటానని శేష్ అనగా… నేను ఆయన (ప్రభాస్) పేరు చెప్పుకుని తిరుగుతుంటే నువ్వు నా పేరు వాడుకుంటున్నావా అని శర్వా అతణ్ని ఎదురు ప్రశ్నించాడు. మరోవైపు శర్వాకు హైదరాబాద్‌లో చాలా ఖరీదైన భూములు ఉన్నాయని ప్రచారం ఉన్న నేపథ్యంలో కాకతీయ హిల్స్‌లో ఎన్ని బిట్లు, ఎన్ని గజాల్లో ఉన్నాయి అని అడిగాడు బాలయ్య. అన్నీ ఐదొందల గజాల బిట్లే అని శర్వా చెప్పగా.. ఇంతకీ నీ ఫోన్లు ఎన్ని బిట్లున్నాయి అంటూ తన కొంటెతనం ప్రదర్శించాడు బాలయ్య.
ఇక షోలో భాగంగా బాలయ్య అడిగిన ఒక ప్రశ్న హైలైట్ అని చెప్పాలి. సెల్ఫీ అడిగితే చెంప చెల్లుమనిపించే హీరో ఎవరు అని బాలయ్య అడగ్గా శేష్, శర్వానే కాక ఆడిటోరియంలో ఉన్న వాళ్లందరూ కూడా గొల్లుమన్నారు. ఇది బాలయ్య తన మీద తాను వేసుకున్న సెటైర్ అని వేరే చెప్పాల్సిన పని లేదు.
This post was last modified on November 1, 2022 5:30 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…