మాళవిక మోహనన్ చేసిన సినిమాలేవి అంటే సమాధానం చెప్పడానికి కొంచెం తడుముకోవాల్సిందే. విజయ్ మూవీ ‘మాస్టర్’ మినహాయిస్తే ఆమె కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. మలయాళంలో ‘గాడ్ ఫాదర్’ అనే సినిమాలో కథానాయికగా నటించిన ఆమె.. రజినీకాంత్ మూవీ ‘పేట’లో ఆయన చెల్లెలి పాత్ర చేసిన విషయం చాలామందికి తెలియదు. ధనుష్‌తో ఆమె నటించిన ‘మారన్’ అనే సినిమా ఓటీటీలో రిలీజై నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఐతే కేవలం తన హాట్ హాట్ ఫొటో షూట్లతోనే మాళవిక తిరుగులేని పాపులారిటీ సంపాదించింది. ఆమెకు, తన అభిమానులకు సినిమాల గురించి అసలు చింతే లేనట్లుగా అనిపిస్తుంది. పెద్దగా సినిమాలు చేయకుండానే తరచుగా సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం మాళవికకే చెల్లు. అందాలకు కొదవే లేని విధంగా ఉంటుంది కాబట్టే ఆమెను తన సోషల్ మీడియా ఫ్యాన్స్ ‘మాల్’ అంటూ కొంటెగా పిలుస్తుంటారు.
ప్రస్తుతం మాళవిక ఏం సినిమాలు చేస్తోందో కూడా పట్టించుకోని ఆమె ఫ్యాన్స్.. రెండు రోజుల కిందట నేషనల్ లెవెల్లో తన పేరు ట్రెండ్ అయ్యే ఆమె ఫొటోలతో ట్విట్టర్‌ను హోరెత్తించేశారు. ఇందుక్కారణం సిల్వర్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతూ మాళవిక చేసిన కొత్త ఫొటో షూటే కారణం. గ్రీకు శృంగార దేవతలా కనిపిస్తున్న మాళవికను చూసి కుర్రాళ్ల గుండెలు లయ తప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు.
ఇంత సొగసు.. పర్ఫెక్ట్ ఫిగర్ ఉండి కూడా సినిమాల్లో ఎందుకు సక్సెస్ కాలేదని ఆశ్చర్యపోతూనే.. సినిమాల్లో బిజీ కాకపోవడమూ ఒకందుకు మంచిదే, కాబట్టే ఇలా తరచుగా హాట్ ఫొటో షూట్లతో అలరిస్తోందని అనుకుంటున్నారు తన ఫాలోవర్లు. ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు కానీ.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రంలో మాళవిక నటిస్తోంది. ఇది కాక తమిళంలో ‘తంగలాన్’ అనే సినిమాలో విక్రమ్‌కు జోడీగ మాళవిక కనిపించనుంది.
This post was last modified on November 1, 2022 5:25 pm
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…