కాంతార అనే చిన్న కన్నడ సినిమా నెల రోజుల నుంచి రేపుతున్న సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. సెప్టెంబరు నెలాఖర్లో కన్నడలో ఓ మోస్తరు అంచనాలతో విడుదలైందీ సినిమా. ముందు కన్నడ ప్రేక్షకులు ఈ చిత్రం పట్ల అమితాసక్తిని ప్రదర్శించారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కన్నడ వెర్షన్ చూడడానికే వేరే భాషల చిత్రాలు ఎగబడ్డారు. ఇది చూసి రెండు వారాల తర్వాత తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ అనువాదం చేసి రిలీజ్ చేశారు. ఇక అప్పుడు మొదలైంది అసలు మోత.
మంచి సినిమా వస్తే భాష, ప్రాంతం అనే బేధాలు లేకుండా ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకున్నారు. కొత్త, పాత తెలుగు సినిమాలన్నింటినీ పక్కన పెట్టి మరీ ఈ చిత్రాన్ని ఆదరించారు. మూడో వారంలోనూ మంచి వసూళ్లతో సాగిపోతున్న ‘కాంతార’ తెలుగులో రూ.20 కోట్ల షేర్ మార్కును టచ్ చేయడం విశేషం.
కాంతార ఓవరాల్ తెలుగు గ్రాస్ వసూళ్లు రూ.50 కోట్ల మార్కును దాటేయడం విశేషం. హిందీలో కూడా ఈ సినిమా రూ.50 కోట్ల మార్కు దిశగా అడుగులు వేస్తోంది. ఇక కన్నడ, ఇతర భాషల్లో కలిపి వసూళ్లు ఆల్రెడీ రూ.150 కోట్ల మార్కును దాటేశాయి. మొత్తంగా ఈ సినిమా వసూళ్లు రూ.250 కోట్ల మార్కును కూడా టచ్ చేశాయి. ఫుల్ రన్లో ‘కాంతార’ రూ.300 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
‘కేజీఎఫ్’ లాంటి భారీ యాక్షన్-మాస్ మూవీ ఆ స్తాయిలో వసూళ్ల మోత మోగించడం ఆశ్చర్యమేమీ కాదు. కానీ పెద్దగా ప్రమోషన్ లేకుండా కేవలం మౌత్ టాక్‌తో ఇతర భాషల వాళ్ల దృష్టిని ఆకర్షించి, హడావుడిగా డబ్ చేసి రిలీజ్ చేయాల్సినంత డిమాండ్ తెచ్చుకుని ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం మాత్రం అనూహ్యం. ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో ‘కాంతార’ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందనడంలో సందేహం లేదు.
This post was last modified on November 1, 2022 3:16 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…