Movie News

లేటేంటి పుష్ప ?

సుకుమార్ తన ప్రతీ సినిమాకు ఏడాదిన్నర పైనే తీసుకుంటాడు. అందుకే ఈ దర్శకుడు ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లవుతున్న చేసిన సినిమాలు వేళ్ళపై లెక్క పెట్టొచ్చు. ఎందుకో రంగస్థలం నుండి సుక్కు మరీ స్లో అయిపోయాడు. ఆ సినిమాను కూడా ఏడాదిన్నర పైనే చెక్కాడు. ఇక పుష్ప విషయానికొస్తే మరీ ఎక్కువ సమయం తీసుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కే దాదాపు ఏడాది సమయం తీసుకున్న సుక్కు షూటింగ్ మొదలయ్యాక దానికి రెండింతలు తీసుకుంటూ మెల్లగా చెక్కుతూ వచ్చాడు. మధ్యలో కోవిడ్ ఎఫెక్ట్ , లాక్ డౌన్ కారణంగా ఆ షూటింగ్ కి ఎక్కువ టైం పట్టిందనుకోవచ్చు, కానీ ఇప్పుడు పుష్ప 2 కి కూడా అదే రిపీట్ చేస్తూ నత్త నడకగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తుండటం బన్నీ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది.

ఇంకో రెండు నెలలైతే పుష్ప పార్ట్ 1 విడుదలై ఏడాది అవుతుంది. ఇంత వరకూ పుష్ప 2 సెట్స్ పైకి వెళ్ళలేదు. మొన్నటి వరకూ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిపిన సుక్కు ఇంకా లుక్ టెస్ట్ లు , టెస్ట్ షూట్ లంటూ కాలం వృధా చేస్తున్నాడు. ఇటివలే బన్నీ లేకుండా ఒక ఐదు రోజులు టెస్ట్ షూట్ చేశారు. మళ్లీ బ్రేక్ తీసుకొని లుక్ టెస్ట్ మొదలు పెట్టారు. ఇప్పటికే చాలా లుక్ టెస్ట్ లు చేశారు. బన్నీ తో ‘పుష్ప ది రూల్’ షూట్ ఎప్పుడు ఉంటుందా ? పుష్ప 2 లో అల్లు అర్జున్ ఎలా కనిపిస్తాడా ? అంటూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇంకా ఆలస్యమా పుష్ప ? అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ అయితే పుష్ప 2 కి సంబంధించి అప్ డేట్స్ లేవని సోషల్ మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సుక్కు మాత్రం బన్నీ ఫ్యాన్స్ నుండి వచ్చే ఒత్తిడి పట్టించుకోకుండా తనకి తెలిసిన స్లో అండ్ చెక్కుడు మేకింగ్ తోనే ముందుకెళ్తున్నాడు. బహుశా పుష్ప కి బాలీవుడ్ లో వచ్చిన రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకొని పార్ట్ లో సుక్కు మార్పులు చేస్తూ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పొడగించి ఉండొచ్చు, కానీ మరీ ఇన్ని నెలలా ? ఇక సెట్స్ లో కూడా సుక్కు తీసిందే మళ్ళీ తీస్తూ నిర్మాతకి బడ్జెట్ భారం పెంచుతాడనే రిమార్క్ ఉంది. ఇకపై అయినా సుక్కు తన స్లో అండ్ స్టడీ మేకింగ్ స్టైల్ పక్కన పెట్టి జెట్ స్పీడులో సినిమాలు చేస్తే బాగుంటుందని, ముఖ్యంగా పుష్ప 2 ను త్వరగా మొదలు పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

This post was last modified on November 1, 2022 12:49 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

లైలా… ఇంత స్పైసీ ఉంటే ఎలా

విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…

26 minutes ago

అక్రమ వలసల విషయంలో భారత్ స్టాండ్ ఏంటి?

అమెరికా ఇటీవల భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్…

37 minutes ago

విశాఖ ఉక్కుపై కేంద్రం కీలక నిర్ణయం

ఇదిగో విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే..అదుగో ప్లాంట్ మూసేస్తున్నారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏకంగా…

2 hours ago

‘తాడేప‌ల్లి ప్యాల‌స్‌’కు నిప్పు.. అనేక సందేహాలు!

వైసీపీ అధినేత జ‌గ‌న్ నివాసం క‌మ్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం ఉన్న గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలోని ప్యాల‌స్‌కు గుర్తు తెలియ‌ని…

2 hours ago

‘లైగర్’లో ఇష్టం లేకుండానే నటించిందట

విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాపై విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ…

2 hours ago

మా ఇంటాయ‌నే ముఖ్య‌మంత్రి.. అయినా మా బాధ‌లు మావే!: భువ‌నేశ్వ‌రి

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి, ఎన్టీఆర్ ట్ర‌స్టు సీఈవో నారా భువ‌నేశ్వ‌రి.. తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌వాడ‌లో మ్యూజిక‌ల్…

2 hours ago