మహేష్ బాబు బావ అనే గుర్తింపుతోనే చాలా ఏళ్ల పాటు బండి నడిపించాడు సుధీర్ బాబు. ఐతే కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, నన్ను దోచుకుందువటే, సమ్మోహనం లాంటి సినిమాలు సుధీర్ బాబుకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. తన మైనస్‌లన్నింటినీ ఆ సినిమాలతో దాదాపుగా అధిగమించాడతను. మహేష్ బాబు తెర వెనుక సపోర్ట్ ఉన్నప్పటికీ.. సొంతంగా అవకాశాలు అందుకునే స్థాయికి చేరుకున్నాడు.
ఐతే అతడికి ఈ మధ్య అస్సలు టైం కలిసి రావట్లేదు. వరుసగా ఫ్లాపులు ఎదురువుతున్నాయి. అలా అని సుధీర్‌కు అవకాశాలకేమీ కొదవ లేదు. ‘సమ్మోహనం’ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణతో ‘వి’ అనే మరో సినిమా చేశాడు సుధీర్. నాని కూడా నటించిన ఈ సినిమాను ఇంద్రగంటి తన స్టైల్‌కు భిన్నంగా యాక్షన్ థ్రిల్లర్‌గా తీశాడు. కానీ సినిమా దారుణంగా బోల్తా కొట్టింది. ఓటీటీలో రిలీజైనప్పటికీ.. దీని రెస్పాన్స్ చూస్తే డిజాస్టర్ అనే చెప్పాలి.
ఇక గత ఏడాది ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్. అది కూడా అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టరే అయింది. ఈ రెండు చిత్రాల్లోనూ సుధీర్ నటనకు ప్రశంసలు వచ్చాయి. కానీ ఫలితం లేకపోయింది. ఇటీవలే తన ఫేవరెట్ డైరెక్టర్ ఇంద్రగంటితో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ మరో క్లాస్ మూవీ చేసి ప్రేక్షకులను పలకరించాడు సుధీర్. అది కూడా తుస్సుమనిపించింది. కానీ సినిమాలు వరుసగా పోతున్నా సుధీర్‌కు ఛాన్సులకైతే లోటు లేదు.
ఆల్రెడీ భవ్య క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థలో ‘హంట్’ అనే యాక్షన్ మూవీ చేశాడు. అది విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే రిలీజైన దాని టీజర్ ఆకట్టుకుంది. దీంతో పాటుగా నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో ‘మాయా మశ్చీంద్ర’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు సుధీర్ హీరోగా ఇంకో సినిమా అనౌన్స్ అయింది. జ్ఞానశేఖర్ అనే కొత్త దర్శకుడితో అతను చేస్తున్న ఈ సినిమాకు ‘హరోం హర’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీని టైటిల్ వీడియో చూస్తే సుధీర్ ఇప్పటిదాకా చేసిన సినిమాలకు భిన్నంగా డివోషనల్ యాంగిల్లో సాగే సినిమాలా కనిపిస్తోంది. 1989 నాటి కుప్పం నేపథ్యంలో సాగే కథ ఇదట.
This post was last modified on October 31, 2022 10:13 pm
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య, తదనంతరం…
దేశవ్యాప్తంగా చాలా కాలంగా చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటులో ఆమోద ముద్ర పడి పోయింది. పార్లమెంటులోని దిగువ…
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. ఇప్పటికే మొన్నామధ్య సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్…
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…