Movie News

ధనుష్ అయినా ధైర్యం చేస్తాడా?

మధ్యే విడుదలైన ‘ప్రిన్స్’ సినిమా గురించి ముందు ఇచ్చిన బిల్డప్ వేరు. దీన్నొక ద్విభాషా చిత్రంగానే మొదట్నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. ‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజ్ డాన్’ సినిమాలతో తెలుగులో ఒక మోస్తరుగా గుర్తింపు సంపాదించుకున్న శివకార్తికేయన్.. ‘ప్రిన్స్’ మూవీతో తెలుగులో తనదైన ముద్ర వేస్తాడని అనుకున్నారు.

ఏషియన్ మూవీస్ సునీల్ నారంగ్, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కలిసి నిర్మించిన సినిమా కావడం.. ‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ కేవీ రూపొందించిన చిత్రం ఇదే కావడంతో దీనిపై తెలుగులో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ మధ్యలో ఏమైందో ఏమో చిత్ర బృందం రాజీ పడిపోయింది. తెలుగులో ఈ సినిమాను వేరుగా తీయలేదు. తమిళంలో తీసి తెలుగులోకి డబ్ చేశారు. ట్రైలర్ చూసినపుడు కానీ ఈ విషయం అర్థం కాలేదు. అనుదీప్ ‘జాతితర్నాలు’ తరహా కామెడీనే ట్రై చేసినప్పటికీ తెలుగు టచ్ లేకపోవడం వల్ల ‘ప్రిన్స్’ తేడా కొట్టేసింది.

ఇక తాజాగా విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ‘వారసుడు’ సినిమా విషయంలోనూ దర్శకుడు వంశీ పైడిపల్లి ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఇది కూడా తమిళ సినిమానే అని, తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నామని చెప్పాడు. తెలుగులో వేరుగా తీస్తే మంచి ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఎందుకిలా చేస్తున్నారన్నది అర్థం కాని విషయం.

ఇప్పుడిక అందరి దృష్టీ ధనుష్ మూవీ ‘సార్’ మీద పడింది. ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న వెంకీ అట్లూరి తెలుగు దర్శకుడు. నిర్మాణ సంస్థ కూడా ఇక్కడిదే. ధనుష్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. దీన్ని ముందు నుంచి ద్విభాషా చిత్రంగానే చెబుతున్నారు. టీజర్లో కూడా ధనుష్ స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. ఐతే ఓవరాల్ సినిమా చూసినపుడు ఇది తెలుగు ఫిలిం అన్న ఫీలింగ్ కలగడం.. ఆ మేరకు టీం ఎఫర్ట్ పెట్టి ఉండడం కీలకం. అలా ఉంటేనే తెలుగులో సినిమా ఇంకో లెవెల్లో ఆడడానికి, ధనుష్‌కు మార్కెట్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. మరి అతనెంతమాత్రం ధైర్యం చేస్తాడో చూడాలి.

This post was last modified on October 31, 2022 10:10 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

7 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

10 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

10 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

11 hours ago