నిన్నటితరం తెలుగు ప్రేక్షెకులకు తమిళ కథానాయకుడు కార్తీక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అభినందన లాంటి స్ట్రెయిట్ మూవీతోనే కాక మౌనరాగం, ఘర్షణ లాంటి డబ్బింగ్ చిత్రాలతో అతను మన ప్రేక్షకుల మనసు దోచాడు. మిగతా సీనియర్ నటుల్లా అతను క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను పొడిగించుకోలేదు. చాలా ఏళ్ల కిందటే నటనకు దూరం అయ్యాడు.
ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ మణిరత్నం కడలి సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు గౌతమ్ కార్తీక్. ఆ సినిమా హిట్టయి ఉంటే తండ్రి లాగే తెలుగులోనూ గౌతమ్ పాపులారిటీ సంపాదించేవాడేమో. కానీ కడలి తుస్సుమంది. ఆ తర్వాత తమిళంలో ఓ మోస్తరు విజయాలతో హీరోగా స్థిరపడ్డాడు గౌతమ్. అతనక్కడ పెద్ద స్టార్ కాదు. అలాగని మరీ తీసిపడేసే హీరో కూడా కాదు.
కెరీర్లో ఎదిగే ప్రయత్నంలో ఉండగానే గౌతమ్ కార్తీక్ మలయాళ భామ మాంజిమా మోహన్‌తో ప్రేమలో పడ్డాడు. గౌతమ్ మీనన్ మూవీ సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో నాగచైతన్యకు జోడీగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మాంజిమా ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో కెరీర్లో ముందుకు వెళ్లలేకపోయింది. తమిళం, మలయాళంలో మరికొన్ని సినిమాలు చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. దాదాపుగా కెరీర్ ముగిసిపోయిన మాంజిమాతో గౌతమ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి మీడియాకు ముందే తెలుసు. ఐతే వీళ్ల ప్రేమాయణం ఎంత సీరియస్సో, తమ బంధాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తారో అని ఎదురు చూశారు.
ఐతే గౌతమ్, మాంజిమా ఎట్టకేలకు తమ బంధాన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా అధికారికంగా ప్రకటించారు. అందగాడైన గౌతమ్ పక్కన మాంజిమా కొంచెం సాధారణంగానే కనిపిస్తుంది. పైగా ఆమె హీరోయిన్‌గా కూడా అంతగా సక్సెస్ అయింది లేదు. కానీ వ్యక్తిగా మాంజిమా.. గౌతమ్‌కు బాగా నచ్చి ఉండొచ్చు. ఇరు కుటుంబాల అంగీకారంతో త్వరలోనే జంట పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతోంది.
This post was last modified on October 31, 2022 10:03 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…