కాజల్ కి ఇలియానా ఝలక్!

కాజల్ అగర్వాల్ కి మునుపటి స్థాయిలో అవకాశాలు రావడం లేదు. అయితే సీనియర్ హీరోల పక్కన నటించడానికి ఉన్న అతి కొద్ది ఆప్షన్స్ లో కాజల్ మెయిన్ కాబట్టి అక్కడ ఆమె ఆడిందే ఆట అవుతోంది.

యువ హీరోలతో నటించడానికి అవకాశాలు రాకపోయినా కానీ… సీనియర్ హీరోల దగ్గరకు వచ్చేసరికి కాజల్ చాలా డిమాండ్ చేస్తోంది. ఎన్నో ఏళ్ల అనుభవం ఉండడంతో ఎవరి అవసరం ఎంత అనేది కాజల్ కి బాగా తెలుసు. అందుకే ఎవరిని ఎంత అడిగితే తనకు నో చెప్పకుండా ఇచ్చేస్తారనేది కాజల్ కనిపెట్టేసి నిర్మాతల ముక్కు పిండేస్తోంది.

అయితే సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం లేదనే సంగతి ఇలియానా కూడా పసిగట్టింది. అలాగే కాజల్ ఎలా క్యాష్ చేసుకుంటున్నదీ కూడా తెలుసుకుంది. అందుకే తాను సీనియర్లతో నటించడానికి సిద్ధమంటూనే చాలా రీజనబుల్ రేట్స్ కోట్ చేస్తోంది. ఇలియానా మన సీనియర్లతో నటించలేదు కనుక ఫ్రెష్ కాంబినేషన్ అనే ఫ్యాక్టర్ కి తోడు ఆమె రీజనబుల్ రెమ్యూనరేషన్ కూడా గోవా సుందరికి ప్లస్ అయ్యేలాగుంది.