ప్రతి ఆదివారం ఊళ్ళలో సంతలు జాతరలు జరిగినట్టు కొన్ని శుక్రవారాలు ఒకే రోజు టాలీవుడ్ లోనూ వరస బెట్టి సినిమాలు రిలీజ్ చేసి తర్వాత ఎప్పుడో టీవీలో వచ్చినప్పుడు అసలివి ఎప్పుడు తీశారోనని అనుమానం వచ్చేలా చేస్తారు. ఇప్పుడు నవంబర్ 4 పరిస్థితి చూస్తే అదే అనిపిస్తోంది. ఒకటి రెండు కాదు నవరత్నాల టైపులో మొత్తం తొమ్మిది చిత్రాలు నువ్వా నేనా అంటూ తేల్చుకోబోతున్నాయి. ఇందులో క్యాస్టింగ్ ఉన్నవి కంటెంట్ ఉన్నవి అసలెవరికీ తెలియనిని అన్నీ ఉన్నాయి కానీ దేనికీ మార్నింగ్ షో టికెట్లు దొరకనంత హౌస్ ఫుల్ అయ్యే సీనయితే కనిపించడం లేదు. అన్నీ టాక్ ని నమ్ముకున్నవే.
చాలా గ్యాప్ తర్వాత వస్తున్న అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ మీద ట్రైలర్ చూశాక యూత్ లో కాసిన్ని అంచనాలు ఏర్పడ్డాయి కానీ మొత్తంగా చూస్తే హైప్ పెద్దగా లేదు. ఫస్ట్ డే చాలా బాగుందనే మాట బయటికి వస్తే తప్ప రెండో రోజు నుంచి పికప్ చూడలేం. థియేటర్ మెటీరియల్ గా ఇంకా ప్రూవ్ కానీ సంతోష్ శోభన్ తో దర్శకుడు మేర్లపాక గాంధీ తీసిన ‘లైక్ షేర్ సబ్స్క్రైబ్’ టైటిల్ నుంచే అర్బన్ ఆడియన్స్ టార్గెట్ చేసుకుంటూ వస్తోంది. ప్రమోషన్లు గట్రా గ్రాండ్ గా చేస్తున్నారు కానీ జనంలో దీని మీద ఏమంత సీరియస్ నెస్ లేదు. జాతరత్నాలు రేంజ్ రెస్పాన్స్ వస్తేనే హిట్టు అనిపించుకునే సీన్ దీనిది.
మల్టీ లాంగ్వేజెస్ లో వస్తున్న ‘బనారస్’ బడ్జెట్ కి, పబ్లిసిటీకి బాగానే ఖర్చు పెట్టారు కానీ దానికి తగ్గ అంచనాలు మాత్రం ఏర్పడలేదు. నందు ఇంకా హీరోగా చేస్తున్నాడా అని ఆశ్చర్యపోయేలా ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సైతం నాలుగో తేదీ కావాలని పట్టుబట్టింది. జెట్టి, సారధి, తగ్గేదెలే, మిస్టర్ తారక్ లు థియేటర్లో అడుగుపెడుతున్నాయి. వీటిలో కొన్ని ట్రైలర్లు ఆసక్తికరంగానే ఉన్నాయి కానీ పబ్లిక్ ని మొదటిరోజే ఫుల్ చేయడం కష్టం. ఓటిటిల కండీషన్లో లేక దగ్గర్లో మంచి డేట్లు లేవు కాబట్టి విధి లేని పరిస్థితిలో ఇంత పోటీకి రెడీ కావడమో తెలియదు కానీ మొత్తానికి ఈ నవరత్నాల్లో ఎన్ని వజ్రాలు మెరుస్తాయో చూడాలి
This post was last modified on October 31, 2022 5:31 pm
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…