టాలీవుడ్ లో కొందరు దర్శకులకు ఓ సెపరేట్ బ్రాండ్ ఉంది. అందులో కృష్ణవంశీ ఒకరు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆయన బ్రాండ్ పడిపోయింది. ప్రేక్షకుల్లో ఆయన మీద ఉన్న రెస్పక్ట్ అలానే ఉంది కానీ ఆయన సినిమాల మీద మాత్రం ఎవరికీ అంచనాలు ఉండట్లేదు. నిజానికి సక్సెస్ ,ఫెయిల్ సంబంధం లేకుండా కొందరికి మార్కెట్ ఉంటుంది కానీ కృష్ణవంశీ మార్కెట్ ఇప్పుడు డల్ గానే ఉంది. ‘మొగుడు’, ‘పైసా’, ‘గోవిందుడు అందరివాడేలె’ ‘నక్షత్రం’ సినిమాలు వంశీ మార్కెట్ ను బాగా దెబ్బ తీశాయి.
దీంతో ఆయన తీసిన ‘రంగమార్తాండ’ కి ఇప్పుడు బిజినెస్ కష్టాలు ఎదురవుతున్నాయి. సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. మధ్యలో ప్రకాష్ రాజ్ డేట్స్ వల్ల కాస్త ఆలస్యం జరిగింది. మొన్నీ మధ్యే మిగిలిన నాలుగైదు రోజుల షూట్ కూడా పూర్తయింది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ కృష్ణవంశీ మీడియా ముందుకొచ్చి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలేవి సినిమాకు ప్లస్ అవ్వలేదు. పైగా కృష్ణవంశీ గత సినిమాలా మీదే ఎక్కువ మాట్లాడి మీడియాకి కావాల్సిన స్టఫ్ ఇచ్చారు. ఇంకా సినిమాకు బిజినెస్ అవ్వలేదని తెలుస్తుంది.
తాజాగా కృష్ణవంశీ తన సోషల్ మీడియాలో బ్రహ్మానందం , రమ్య కృష్ణ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. కొన్ని నెలల క్రితం డబ్బింగ్ మొదలైంది. ఇప్పటికే చాలా మంది చెప్పేశారు కూడా. కానీ కృష్ణవంశీ ఇంకా డబ్బింగ్ ఫోతోలనే పెడుతూ రిలీజ్ డేట్ మాత్రం చెప్పకోవడం ఆడియన్స్ విసుగు తెప్పిస్తుంది. వంశీ సినిమా చూద్దామనుకునే కొందరు ప్రేక్షకులు డబ్బింగ్ సరే కానీ రిలీజ్ ఎప్పుడు అంటూ మాట్లాడుకుంటున్నారు. మరాఠి నటసామ్రాట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. రమ్య కృష్ణ ,బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మరి రంగమార్తండ రిలీజ్ మోక్షం ఎప్పుడు కలుగుతుందో ?
This post was last modified on October 31, 2022 1:03 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…