నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా శిరీష్ హీరోగా తెరకెక్కిన ‘ఊర్వసివో రాక్షసివో’ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈవెంట్ కి విచ్చేసిన అందరూ బాలయ్య ముందు మాట్లాడటానికి భయపడుతూ ఏవో చిన్న చిన్న స్పీచులతో ముగించారు. అయితే అల్లు శిరీష్ మాత్రం ఒక అడుగు ముందుకేసి బాలయ్య ను కొన్ని సరదా ప్రశ్నలు అడిగాడు. అందులో మొదటి క్వశ్చన్ మీరు నటించిన హీరోయిన్స్ లో ఎవరు ఊర్వసి ఎవరు రాక్షసి ? ముందుగా విజయశాంతి అని శిరీష్ అడగ్గానే బాలయ్య ఇంకా పేర్లు చెప్పు అంటూ మిగతా ఆప్షన్స్ అడిగాడు. అందులో నయనతార ఊర్వసి , శృతి హాసన్ రాక్షసి అని చెప్పాడు.
ఇక ఈవెంట్ లో మీరు నటించిన సింహం టైటిల్ తో ఓ సినిమా ఉంది నేను చెప్పిన వాటిలో అది లేదు ఏమా సినిమా ? అంటూ బాలయ్య ని అడిగాడు శిరీష్. వెంటనే బాలయ్య బొబ్బిలి సింహం అనేసరికి అది కాదు ‘సింహం నవ్వింది ‘ అంటూ శిరీష్ టైటిల్ చెప్పే సరికి అది ఆడలేదు కదా అయినా సింహం నవ్వింది ఏంటి ? సింహం ఎక్కడైనా నవ్వుతుందా ? నా ఫ్లాప్ సినిమాలను గుర్తుచేస్తున్నావ్ ఏమిటి ? అంటూ చమత్కరించాడు బాలయ్య.
చివరిగా శిరీష్ మీ సినిమాలో నాకు ఓ కేరెక్టర్ ఇవ్వాలి అంటూ బాలయ్య ముందు తన మనసులో ఉన్న ఆలోచన భయపెట్టి అడిగాడు. వెంటనే బాలయ్య పరశురాం అంటూ ఆ దర్శకుడి పేరు పలుకుతూ చూడమ్మా కథ సిద్దం చెయ్, నేను శిరీష్ ని చెదగొట్టడమా ? లేదా శిరీష్ నన్ను చెడగొట్టడమా ? అలాంటి కథేమైనా ఉంటే చెప్పు అంటూ బాల్ పరశురాం కోర్టులో వేసేశాడు. ఇక శిరీష్ ని పెళ్ళెప్పుడు ? అంటూ చాలా సార్లు బాలయ్య ప్రశించగా శిరీష్ మాత్రం ఆ ప్రశ్నకి సమాదానం ఇవ్వకుండా దాటేస్తూ వచ్చాడు. ఏదేమైనా బాలయ్య రాకతో శిరీష్ సినిమాకు సోషల్ మీడియాలో కావలిసినంత బజ్ వచ్చేసింది.
This post was last modified on October 31, 2022 9:42 am
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…