సమంత బేసిగ్గా తమిళ అమ్మాయి కానీ.. ఆమెను అపూర్వంగా ఆదరించింది.. పెద్ద స్టార్ హీరోయిన్‌ని చేసింది తెలుగు ప్రేక్షకులే. టాలీవుడ్లో దాదాపు పుష్కర కాలం నుంచి ఆమె హవా నడుస్తోంది. ఇక్కడి ప్రేక్షకులను ఆమెను ఎప్పుడూ నాన్ లోకల్ అని ఫీల్ కాలేదు. తెలుగులో ఎక్కువగా పర భాషా హీరోయిన్లదే అధిపత్యం అయినప్పటికీ.. సమంతను ఓన్ చేసుకున్నట్లు ఆమె సమకాలీన స్టార్ హీరోయిన్లు చాలామందిని మన వాళ్లు ఓన్ చేసుకోలేదు.
కేవలం సినిమాలతోనే కాక తన వ్యక్తిత్వం, చలాకీతనం, సేవాగుణంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకుందామె. అందుకే వ్యక్తిగత జీవితంలో ఆమెకు ఏమైనా కష్టం వచ్చినా చాలా ఫీలైపోతారు ఫ్యాన్స్. కేవలం సాధారణ అభిమానులే కాదు.. ఇండస్ట్రీ జనాలు కూడా సమంత మీద చూపించే ఆపేక్షే వేరు.
నాగచైతన్యతో సమంత విడాకుల సమయంలో అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఎంత ఫీలయ్యారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సమంతకేదో అరుదైన అనారోగ్య సమస్య తలెత్తిందని అందరూ కదిలిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని ఇండస్ట్రీలో ఎంతోమంది సమంత కోలుకోవాలంటూ మనఃపూర్వకంగా మెసేజ్‌లు పోస్ట్ చేశారు.
ఆమె ధైర్యాన్ని, దృఢమైన వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తూ ఈ దశను అధిగమించాలని ఆకాంక్షించారు. చైతూ నుంచి విడిపోయినా సరే.. ఆమె మాజీ మరిది అఖిల్ అక్కినేని సైతం సమంత కోసం స్పందించాడు. అక్కినేని నాగార్జున స్వయంగా సమంతను కలిసి ఆమెను పరామర్శించబోతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అభిమానులైతే సమంత ట్రూ వారియర్ అని, ఆమె కచ్చితంగా ఈ దశను అధిగమించి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యం సంపాదిస్తుందని ధైర్యవచనాలతో కూడిన పోస్టులు గుమ్మరిస్తున్నారు. తనపై అందరూ చూపిస్తున్న అభిమానం చూసి సమంత ఈ సంక్లిష్ట దశను సులువుగానే అధిగమిస్తుందని ఆశిద్దాం.
This post was last modified on October 31, 2022 7:41 am
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…