తమిళంలో వారిసుకి ఎంత భీకరమైన హైప్ ఉండొచ్చు గాక తెలుగులో మాత్రం దీని మీద ఏమంత ఆసక్తి కనిపించడం లేదన్నది వాస్తవం. ఆది పురుష్, వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిల మీదున్న బజ్ తో పోలిస్తే వారసుడు వాటికి దరిదాపుల్లో కూడా లేదు. నిర్మాత దిల్ రాజు కావడం వల్ల ఇక్కడ పెద్ద రిలీజ్ దక్కే అవకాశాలున్నాయి కానీ వాటిని తట్టుకుని నిలవడం మాత్రం అంత సులభంగా ఉండదు.పైగా ఇప్పటిదాకా వదిలిన పోస్టర్లు స్టిల్లు ఫ్యాన్స్ కు తప్ప మిగిలినవాళ్లకు మాములుగా అనిపిస్తున్నాయి. వీటికి మహేష్ బాబు మహర్షికు లింక్ ఏమిటనే సందేహం వచ్చిందా. అక్కడికే వద్దాం.
వారసుడు దర్శకుడు వంశీ పైడిపల్లి గత చిత్రం మహర్షికి ఇప్పుడీ వారసుడికి మేకింగ్ లో కానీ గెటప్స్ లో కానీ చాలా దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి. వేషభాషలు దగ్గరగా ఉన్నాయి. ఆ రెండు ఫోటోలను పోలుస్తూ ప్రిన్స్ ఫ్యాన్స్ గతంలో తమను ట్రోల్ చేసిన విజయ్ అభిమానులను టార్గెట్ చేసుకుని ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వార్ మొదలుపెట్టారు. వాళ్ళు అన్నారని కాదు కానీ నిజంగానే సారూప్యతలు కనిపిస్తున్నాయి. పైగా కథ కూడా అజ్ఞాతవాసిలా దూరంగా వెళ్ళిపోయిన వారసుడు తిరిగి కుటుంబం కోసం వచ్చి వ్యాపార సామ్రాజాన్ని ఎలా నిలబెట్టాడనే పాయింట్ మీద సాగుతుందనే లీక్ ముందు నుంచి ఉంది.
ఈ స్టోరీ నిజం కాకపోవచ్చు కానీ వారసుడులో వంశీ ఏదో డిఫరెంట్ గా కొత్తగా ట్రై చేశాడని మాత్రం అనిపించడం లేదు. టీజర్ వచ్చాక అభిప్రాయాల్లో ఏమైనా మార్పులు ఉండొచ్చేమో చెప్పలేం. అయితే కాంపిటీషన్ టఫ్ గా ఉన్న తరుణంలో పబ్లిసిటీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తే తప్ప వారసుడికి బజ్ రావడం కష్టం. తమన్ పాటల గురించి ముందు నుంచి తెగ ఊరిస్తున్నాడు. నవంబర్ 4న వచ్చే మొదటి ఆడియో సింగల్ తో దాని మీద కూడా ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ ఫ్యామిలీ కం యాక్షన్ డ్రామాలో తెలుగు తమిళ ఆర్టిస్టులు చాలానే ఉన్నారు.
This post was last modified on October 30, 2022 2:23 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…