Movie News

RC 15 కోసం క్రేజీ ఈవెంట్ సిద్ధం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ స్పిల్ బర్గ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న RC 15 తాలూకు అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా నిర్మాత దిల్ రాజుని టార్గెట్ చేసుకుంటే ఆయన ఏకంగా పబ్లిక్ స్టేజి మీద తన పరిస్థితిని చెప్పుకున్నారు. విజయ్ తో వారసుడు నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో దాని ప్రమోషన్ తప్ప ఇంకే ఇతర ప్రాజెక్టు గురించి పబ్లిసిటీ చేయకూడదని ఎస్విసి సంస్థ ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల ఇలా జరిగింది. అందరి చూపు ముందు దీనికేం టైటిల్ పెడతారా అనే దాని మీదే ఉంది. దీనికి సంబంధించి ఒక్క లీక్ బయటికి రాలేదు.

తాజా సమాచారం మేరకు ఆర్ సి 15 తాలూకు టైటిల్ లాంచ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారట. 2023 సంక్రాంతికి వారిసు రిలీజయ్యాక హైదరాబాద్ లేదా ముంబై ఒక చోట వేదికను సెట్ చేసుకుని ఇప్పటిదాకా కనివిని ఎరుగని స్థాయిలో ఓ పెద్ద వేడుక చేయబోతున్నట్టు తెలిసింది. ముఖ్య అతిథులుగా కెజిఎఫ్ ఫేమ్ యష్, తమిళ స్టార్ హీరో సూర్యలు ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయిన వాళ్ళలో ఉన్నారని తెలిసింది. మరికొందరు గెస్టులను ఫైనల్ చేసే పని జరుగుతున్నట్టుగా తెలిసింది. ఒక అరుదైన కలయిక మధ్య నెవర్ బిఫోర్ తరహాలో టైటిల్ ని రివీల్ చేస్తారు.

కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ బయటికి రాకుండానే ఈ ప్యాన్ ఇండియా మూవీ బిజినెస్ క్రేజీగా జరుగుతోంది. ఓవర్సీస్ హక్కులు సుమారు 15 కోట్లకు అమ్ముడుపోయినట్టు వినికిడి. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఎంక్వయిరీలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇంకా విడుదల తేదీ లాక్ చేయలేదు కాబట్టి దిల్ రాజు ప్రస్తుతం ఇవన్నీ ఫైనల్ చేసే మూడ్ లో లేరు. ముందు వారసుడుని క్లోజ్ చేసి దాని రన్ పూర్తయ్యాక అప్పుడు ఒక్కొక్కటి సెటిల్ చేయబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో ఎస్జె సూర్య విలన్ కాగా తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది.

This post was last modified on October 30, 2022 12:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

5 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

5 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

6 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago