అల్లు శిరీష్ హీరోగా కెరీర్ మొదలు పెట్టి చాలా ఏళ్లవుతుంది. అప్పుడెప్పుడో ‘గౌరవం’ సినిమాతో హీరోగా వచ్చిన శిరీష్ ఇప్పటికీ ఓ సాలిడ్ హిట్ అందుకోలేకపోతున్నాడు. ఆ మధ్య ‘శ్రీరస్తు శుభమస్తు’ తో ఓ హిట్ అందుకున్నాడు మళ్ళీ ఆ తర్వాత చేసినవన్నీ శిరీష్ నిరాశే మిగిల్చాయి. ‘ఒక్క క్షణం’ అనే డిఫరెంట్ స్టోరీతో ఎక్సపెరిమెంట్ చేసినా ఆ సినిమా కూడా హిట్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘ABCD’కూడా ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేసి శిరీష్ కి మరో ఫ్లాప్ మిగిల్చింది. దీంతో కొన్నేళ్ళు గ్యాప్ తీసుకున్న శిరీష్ మళ్ళీ ‘ఊర్వసివో రాక్షసివో’ అనే యూత్ ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
శిరీష్ హీరోగా అను ఇమ్మానుయల్ జంటగా రాకేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. శిరీష్ ఇప్పటికే ఇంటర్వ్యూ లు , టూర్లతో చేయాల్సిన అన్ని ప్రమోషన్స్ చేసేశాడు. రేపు ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి బాలయ్య కూడా రంగంలో దిగబోతున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసి అల్లు అరవింద్ ,శిరీష్ గురించి మాట్లాడి సినిమాను సపోర్ట్ చేయనున్నాడు. ఇదే ఈవెంట్ లో బాలయ్య సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నాడు. ట్రైలర్ తో సినిమాపై మరికొన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది.
ఏదేమైనా శిరీష్ కి ఈ సినిమాతో హిట్ కొట్టడం చాలా ముఖ్యం. హీరోగా మరింత బిజీ అవ్వాలన్న మరో నిర్మాత తనను నమ్మి సినిమా తీసేందుకు ముందుకు రావాలన్న ఈ సినిమా హిట్ అవ్వాలి. ఇక ఈ శుక్రవారం శిరీష్ సినిమాకు పోటీగా మరికొన్ని చిన్న సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. వాటిలో శిరీష్ సినిమా మీదే కొంత బజ్ ఉంది కాబట్టి టాక్ బాగుంటే శిరీష్ హిట్ కొట్టే అవకాశం కనిపిస్తుంది. చూడాలి అల్లు వారబ్బాయి ఈ ఛాలెంజ్ ఎలా ఫేస్ చేస్తాడో ?
This post was last modified on October 30, 2022 12:12 pm
వైసీపీ అధినేత జగన్ నివాసం కమ్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్యాలస్‌కు గుర్తు తెలియని…
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాపై విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ…
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు సీఈవో నారా భువనేశ్వరి.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మ్యూజికల్…
వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, ఇది…
తండేల్ ప్రమోషన్లలో భాగంగా అల్లు అరవింద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మగధీర తన మేనల్లుడు రామ్ చరణ్ కు ఎలాగైనా…
రైల్వేలలో కొత్త జోన్ కోసం జరిగిన ప్రయత్నాలు.. ఒత్తిళ్లు ఎట్టకేలకు ఫలించాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖ కేంద్రంగా జోన్…