పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో మొదలయ్యింది. ఇటీవలే దీనికోసమే ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహిస్తే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ చాలా బ్యాలన్స్ ఉంది.
వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో విడుదల చేయడం అనుమానంగానే ఉంది. అందుకే యూనిట్ కూడా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వడం లేదు. పవన్ జనసేన కార్యకలాపాలు ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరిగిన తరుణంలో నిర్మాతలకు వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది.
ఇందులో ఔరంగజేబ్ గా ఒక కీలకమైన పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించవచ్చే వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ముందు ఈ క్యారెక్టర్ కోసం అర్జున్ రామ్ పాల్ ని తీసుకున్నారు. కానీ చిత్రీకరణలో జాప్యం వల్ల అతని డేట్స్ మళ్ళీ అందుబాటులో లేకుండా పోయాయి.
బాబీడియోల్ సంసిద్ధత వ్యక్తం చేసేలా సూచనలు ఇవ్వడంతో ఆ దిశగా క్రిష్ ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఇదింకా అధికారిక ప్రకటన కాలేదు. పవన్ ఎన్ని రోజులు కాల్ షీట్స్ ఇస్తారనే దాని బట్టి బాబీడియోల్ నిజంగా చేస్తాడా లేదా అనే క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే.
కాకతాళీయంగా పవన్ కళ్యాణ్, బాబీడియోల్ ఇద్దరూ కేవలం ఒక ఏడాది గ్యాప్ లోనే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ధర్మేంద్ర వారసుడు 1995లో బర్సాత్ తో బోణీ చేయగా చిరంజీవి తమ్ముడి ఎంట్రీ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో జరిగింది.
ఇప్పుడు బాబీ డియోల్ వెబ్ సిరీస్ లకు షిఫ్ట్ అయ్యాడు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ఇటీవలే ఆశ్రమ్ రూపంలో పెద్ద హిట్టు అందుకున్నాడు. పవన్ మాత్రం అప్పటికి ఇప్పటికీ అంతకు పదింతలు ఎక్కువ ఇమేజ్ తో కొనసాగుతున్నాడు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రెండు వరస రీమేక్ ల తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్నీ వీరమల్లు మీదే ఉన్నాయి.
This post was last modified on October 29, 2022 8:59 pm
ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ…
పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి…
గ్రామ పంచాయతీలపై జనసేన పార్టీ పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలను…
అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…
హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…
అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…