Movie News

బింబిసార-2.. ఇప్పుడే కాదు

ఈ ఏడాదే కాదు.. గత కొన్నేళ్లలో వచ్చిన సెన్సేషనల్ హిట్లలో ‘బింబిసార’ ఒకటి. ఫ్లాపులతో సతమతం అవుతున్నా కళ్యాణ్ రామ్‌ను హీరోగా పెట్టి భారీ బడ్జెట్లో, చారిత్రక నేపథ్యంతో ఒక కొత్త దర్శకుడు సినిమా తీయడం చూసి చాలామంది షాకయ్యారు. ఇది ఏమాత్రం వర్కవుట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు రాజుగా కళ్యాణ్ రామ్ ఏం సెట్టవుతాడని సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఈ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ‘బింబిసార’ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

దుర్మార్గుడైన రాజు పాత్రలో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడు. పెట్టించిన ఖర్చు మీద ఆదాయాన్ని తెచ్చి పెట్టే స్థాయిలో సినిమాను పెద్ద హిట్ చేశాడు కొత్త దర్శకుడు వశిష్ఠ్. విడుదలకు ముందు బింబిసారను మూడు భాగాలుగా తీసే అవకాశం ఉందని కళ్యాణ్ రామ్ అంటే నవ్వుకున్న వాళ్లు.. ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

బింబిసార-2 కోసం ఆల్రెడీ సన్నాహాలు మొదలైన మాట వాస్తవమే కానీ.. ఈ సినిమా తెరకెక్కడానికి, విడుదల కావడానికి చాలా టైం పట్టేలాగే కనిపిస్తోంది. ఈ దిశగా దర్శకుడు వశిష్ఠ్ సంకేతాలు ఇచ్చాడు. ఇప్పుడిప్పుడే ఈ సినిమా మొదలుపెట్టే అవకాశాలు లేవని అతను స్పష్టం చేశాడు. కళ్యాణ్ రామ్‌కు ప్రస్తుతం కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయని, అవన్నీ పూర్తి చేశాకే ఈ సినిమా మొదలవుతుందని అతను స్పష్టం చేశాడు. ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అందుకోవడానికి తన టీం చాలా కష్టపడాల్సి ఉందని వశిష్ఠ్ తెలిపాడు.

“బింబిసార సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ప్రస్తుతం వాళ్లందరూ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. నేను వాళ్లందరికీ కొత్తదనాన్ని ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ల అంచనాలకు తగ్గట్లు సినిమాను రూపొందించాలనుకుంటున్నాం. మొదటి భాగాన్ని మించి రెండో పార్ట్‌ను తీయాలనే ఒత్తిడి నాప ఉంది. కళ్యాణ్ రామ్ తన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బింబిసార-2 షూటింగ్ మొదలవుతుంది” అని వశిష్ఠ్ చెప్పాడు.

This post was last modified on October 28, 2022 9:24 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

24 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 hour ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

1 hour ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

1 hour ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago