Movie News

పూరిని బ్యాన్ చేయడం సాధ్యమేనా

దర్శకుడు పూరి జగన్నాధ్ ఇన్నేళ్ల కెరీర్లో మొదటిసారి డిస్ట్రిబ్యూటర్లు ఫైనాన్సియర్ల మీద పోలీస్ కేసు దాకా వెళ్లడంతో వ్యవహారం చాలా దూరం వెళ్లిపోయింది. విషయాన్నీ ఇంతదాకా తీసుకొచ్చినందుకు ఇకపై అతని సినిమాలు కొనకుండా బ్యాన్ చేయాలని పంపిణీదారులు నిర్ణయం తీసుకున్నట్టుగా వచ్చిన వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. లైగర్ డిజాస్టర్ తాలూకు నష్టాలను భర్తీ చేసే ఇష్యూలో ఇరు వర్గాల మధ్య ఏర్పడిన వాదోపవాదాలు ఇప్పుడు పీక్స్ కు చేరుకున్నాయి. ముంబైలో ఉన్న పూరి హైదరాబాద్ వచ్చే సూచనలు దగ్గరలో లేవు కానీ ఇక్కడి పరిణామాలు మాత్రం చాలా హాట్ గా మారిపోతున్నాయి. అందులో వచ్చిందే ఈ బ్యాన్ రచ్చ.

ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఈ నిషేధం చేయమనేది అంత సులభం కాదు. ఎందుకంటే కోట్ల రూపాయల వ్యాపారంతో ముడిపడిన సినిమాలో కేవలం ఒక్కరి పాత్రే ఉండదు. ఉదాహరణకు గాడ్ ఫాదర్ ప్రమోషన్ లో చెప్పినట్టు ఒకవేళ చిరంజీవి పూరికి ఓ ఛాన్స్ ఇచ్చారనుకుందాం. అదయ్యాక దర్శకుడి ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా ఆటోమేటిక్ గా క్రేజ్ వచ్చేస్తుంది. అప్పుడు బయ్యర్లు ఇది పూరి తీసింది కాబట్టి మేము మెగాస్టార్ మూవీ కొనమని భీష్మించుకుని ఉండగలరా. ప్రొడక్షన్ వేరేవాళ్లది అయినప్పుడు అలా అనే అవకాశం ఉండదు. మేము కొనమని తెగేసి చెబితే అది పూరికి ఒకటే కాదు ఆయన చేసిన సదరు హీరోకూ వర్తిస్తుంది.

మలయాళంలో అన్ని సినిమాలు ఓటిటిలకే ఇస్తున్నాడని ఫహద్ ఫాసిల్ మీద ఇలాంటి బ్యానే చేసిన అక్కడి డిస్ట్రిబ్యూటర్లు తర్వాత తూచ్ అనేశారు. ముందు మంకుపట్టు పట్టిన మల్టీప్లెక్సులు తర్వాత తమ నిర్ణయం మార్చుకున్నాయి. ఇప్పుడే కాదు పాతికేళ్ల క్రితం ప్రకాష్ రాజ్ ని వెలేసినప్పుడు వాతావరణం సీరియస్ గా ఉండేది. కానీ ఆ తర్వాత ఆయనే టాప్ మోస్ట్ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. ఇప్పుడీ లైగర్ పంచాయితీ కూడా ఏదో రోజు చల్లారిపోతుంది. కాకపోతే పూరికి బయట హీరోలు ఓకే చెప్పడం సులభంగా ఉండదు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ కొత్తవాళ్లతో చేయడమో లేదా కొడుకు ఆకాష్ తో ఒక మంచి స్క్రిప్ట్ ని రెడీ చేసుకోవడమో ఉత్తమం.

This post was last modified on October 28, 2022 7:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైలు వరకు వెళ్లిన కస్తూరి కేసు

తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…

1 hour ago

పుష్ప 3 లో యాక్ట్ చేస్తావా? : తిలక్ ఏమన్నాడంటే…

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…

5 hours ago

‘దళపతి విజయ్’ : సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా..

కోలీవుడ్‌లో చిన్న వ‌య‌సులోనే మంచి పేరు సంపాదించుకున్న ద‌ళ‌ప‌తి విజ‌య్‌. విజ‌య్ సినిమాలు.. క్రిటిక్స్‌, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచ‌నాలు…

5 hours ago

అవినాష్‌రెడ్డికి మ‌రో చిక్కు.. ఇక‌, బీటెక్ రెడ్డి వంతు!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్ప‌టికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒక‌వైపు బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ…

8 hours ago