ఒక చిన్న సినిమాను బిజినెస్ వ్యవహారాలు చక్కదిద్ది థియేటర్ల దాకా తీసుకురావడం నిర్మాతకు ఎంత పెద్ద విషమ పరీక్షో చెప్పనక్కర్లేదు. పోనీ నానా కష్టాలు పడి రిలీజ్ చేసినా ఎలాంటి హైప్ లేకపోతే జనం వచ్చే సీన్ లేదు. విడుదల రోజు మొదటి ఆటకు కనీసం సిబ్బంది రోజువారీ జీతంలో పది శాతం వసూలు చేయలేనంత దారుణంగా పరిస్థితులు తలెత్తుతున్నాయి. స్టార్ క్యాస్టింగ్ లేదా కంటెంట్ పవర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి బలంగా ఉంటే తప్ప గట్టెక్కడం అసాధ్యమనేలా ఉంది. అలా అని మీకు ఇస్తాం కొనేసుకోండి అంటే ఓటిటిలు గుడ్డిగా తలూపడం లేదు. కొత్త కొత్త కండీషన్లు పెట్టి నరకం చూపిస్తున్నాయి.
ఇవన్నీ ఎలాగోలా దాటుకుని ఆహాలో నేరుగా వచ్చిన చిత్రం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. అలీకి ఏపీ ప్రభుత్వం పదవిని ప్రకటించిన మరుసటి రోజే ఇది రావడం విశేషం. మళయాలంలో సక్సెస్ అయిన వికృతికి ఇది సీన్ టు సీన్ రీమేక్. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఆగి ఆగి ఫైనల్ గా డిజిటల్ డీల్ సెట్ చేసుకుని ప్రేక్షకుల ఇళ్లలోకి వచ్చేసింది. మెట్రో ట్రైన్ లో మాటలు రాని శ్రీనివాసరావు(నరేష్) అపస్మారక స్థితిలో పడి ఉంటే దాన్ని ఫోటో తీసిన సమీర్(అలీ)అది వైరల్ అవ్వడానికి కారణమవుతాడు. దీంతో ఆ రావుకి బయట అవమానాలు ఎదురవుతాయి. వ్యవహారం సీరియస్ గా మారుతుంది. ఆపై జరిగేది అసలు స్టోరీ.
ఒరిజినల్ సంగతి ఎలా ఉన్నా అసలు ఆలీకి ఈ వయసులో పాటలు, రొమాన్స్ ట్రాక్ పెడితే ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న ఆలోచన దర్శకుడు కిరణ్ శ్రీపురంకు రాకపోవడం విచిత్రం. ఆర్టిస్టులు తమ పరిధి మేరకు బాగానే నటించినప్పటికీ అవసరం లేని సీన్లు, సాగదీసిన స్క్రీన్ ప్లేతో టైటిల్ లో ఉన్న బాగున్నతనం సినిమాలో లేకుండా పోయింది. నరేష్ పవిత్ర జంటగా కనిపించడం ఒకటే జనాలకు కొంత స్పెషల్ గా అనిపిస్తుంది తప్ప రెండున్నర గంటలకు సరిపడా మ్యాటర్ లేక చూసేవాళ్లకు విసుగు తప్పలేదు. థియేటర్ ని తప్పించుకుంది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే అంతే సంగతులయ్యేవి.
This post was last modified on October 28, 2022 3:34 pm
సాధారణంగా ప్రేమ విఫలమైతేనో, పెళ్లి ఆగిపోతేనో ఎవరైనా కొన్నాళ్లు డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ బాధ నుంచి బయటపడటానికి నెలల సమయం…
తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి పనుల గురించి వివరించడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. ఏపీ పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం…
టాలీవుడ్లో అత్యంత పొడవైన హీరోల లిస్టు తీస్తే.. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరే ముందు చెప్పుకోవాలన్నది వాస్తవం. టాలీవుడ్…
తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చే 2047 నాటికి 3(30 లక్షల కోట్ల రూపాయలు) ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా…
కాంగ్రెస్ అగ్రనేతే కాదు.. లోక్సభలో విపక్ష నాయకుడు కూడా అయిన రాహుల్గాంధీ.. తరచుగా తప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎప్పటికప్పుడు…
2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్…