Movie News

వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న జీ తెలుగు ‘నెంబర్ 1 కోడలు రాహుల్ – సరసు’ మరియు ‘త్రినయని విశాల్ – నయని’!

తెలుగు రాష్ట్రాల్లో నాన్‌స్టాప్‌ వినోదానికి కేరాఫ్‌ అడ్రస్ జీ తెలుగు. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, ఆకట్టుకునే సీరియల్స్‌, అదిరిపోయే సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూనేఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ ఎంటర్టైన్మెంట్ వైపే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో జీ తెలుగు తనని తాను ప్రతీరోజు ప్రజలకి అనుగుణంగా మార్చుకుంటూ, జనం యొక్క నాడిని పసిగట్టి వారిని అలరించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తోంది.

జీ తెలుగులో చాలా సీరియల్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా అతి తక్కువ కాలంలో అందరి మనసును గెలుచుకున్న సీరియల్స్ నెంబర్.1 కోడలు మరియు త్రినయని. ఈ సీరియల్స్ లోని ప్రతీ పాత్ర అందరికి సుపరిచితమే. ఆకట్టుకునే కథనాలతో పాటు, అదిరిపోయే ట్విస్ట్‌లతో అలరిస్తున్న ఈ సీరియల్స్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తుంటారు. ఇక ఈ సీరియల్స్ లో నటిస్తున్న రాహుల్ – సరసు మరియు విశాల్ – నయని ఎప్పుడు కలుస్తారా అని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పుడా సమయం వచ్చేసింది. ఈ వారంలో, అంటే 14 నుంచి 17 జులై వరకు ఆసక్తికరంగా అబ్బురపరిచే ఘట్టాలనడుమ ఆ నలుగురి వివాహ మహోత్సవానికి బాజా భజంత్రీలు మోగబోతున్నాయి. నెంబర్ 1. కోడలు విషయానికి వస్తే ఊరి జనం అంతా కలిసి పెద్దయ్యను ఒప్పించి రాహుల్ కి ఇష్టం లేకపోయినా సరసు మేడలో తాళికటిస్తారు. అలాగే త్రినయని సీరియల్ లో విశాల్ తన తండ్రి జగదీశ్ వర్మ కోసం నయనిని పెళ్లి చేసుకుంటాడు తప్ప భార్యగా మాత్రం ఒప్పుకోడు.

లాక్‌డౌన్‌ పర్మిషన్స్‌లో భాగంగా పరిమిత సిబ్బందితో, కోవిడ్‌-19 రూల్స్‌ పాటిస్తూ ఈ పెళ్లి ఎపిసోడ్స్ షూటింగ్ చేసారు. అంతేకాకుండా బ్రేక్ సమయంలో మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, చిన్నిపాటి విషయాలు కూడా గమనిస్తూ, నిత్యం సీరియల్ సెట్స్ ని శానిటైజ్ చేస్తూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాహుల్- సరసు మరియు విశాల్- నయని పెళ్లి ఎపిసోడ్స్ షూట్ చేసారు.

అద్యంతం ఆకట్టుకునే మలుపులు, అదిరిపోయే కథనంతో సాగిపోతున్న నెంబర్.1 కోడలు మరియు త్రినయని సీరియల్స్ లో రాబోయే ఎపిసోడ్స్‌ని అస్సలు మిస్‌ కాకండి. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 -9 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డి చానల్స్‌లో. మీ ఆప్తులుగా మేము కోరుకునేది ఒకటే, జాగ్రత్తగా ఉండండి. మేము అందించే ఎంటర్టైన్మెంట్ ను ఆస్వాదించండి.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగు సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కుచెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీకుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదాకేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

This post was last modified on July 10, 2020 7:10 pm

Share

Recent Posts

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

42 minutes ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

1 hour ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

3 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

7 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

11 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

11 hours ago