Adipurush
టీజర్ వచ్చినప్పటి నుంచి కాంప్లిమెంట్స్ కన్నా కామెంట్స్ ఎక్కువగా అందుకున్న ఆది పురుష్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు ఓం రౌత్, నిర్మాణ సంస్థ టి సిరీస్ తమ చుట్టూ పరిస్థితులు ఎంత పోటీ వాతావరణాన్ని సృష్టిస్తున్నా సరే సంక్రాంతి విడుదల విషయంలో మాత్రం వెనక్కు తగ్గకూడదని నిర్ణయించుకున్నారట. నార్త్ లో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఎటొచ్చి తెలుగు తమిళంలో చిరంజీవి, బాలకృష్ణ, విజయ్, అజిత్ లాంటి హీరోలను తట్టుకుని ఎక్కువ థియేటర్లను వేసుకోవడం అంత సులభం కాదు. పైగా వీటి నిర్మాతలందరూ పెద్ద హస్తాలే.
స్టార్ క్యాస్టింగ్ కన్నా ఎక్కువగా ప్రభాస్ ఇమేజ్, విజువల్ ఎఫెక్ట్స్ నే ఎక్కువ నమ్ముకున్న ఆది పురుష్ నిడివిని 3 గంటల 15 నిమిషాలకు లాక్ చేశారనే లీక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరీ ఇంత లెన్త్ అంటే కష్టమేమోననే అభిప్రాయం వ్యక్తమవుతోందట. అంటే ఇంటర్వెల్ ఇంకో పావు గంట, హైదరాబాద్ లాంటి నగరాల్లో రానుపోను ప్రయాణం ఒక గంట కలుపుకుని అంత సమయం ప్రేక్షకులు వెచ్చించాలంటే కంటెంట్ ఓ రేంజ్ లో ఉండాలి. ఆర్ఆర్ఆర్ దీనికి పది నిమిషాలే తక్కువున్నా ఆడియన్స్ బోర్ ఫీలవ్వలేదు. సో మెప్పిస్తే జనం ఒప్పుకునే ఛాన్స్ ఉంది.
ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సినిమా ఎలా ఉంటుందోననే టెన్షన్ తో సతమతమవుతున్నారు. సాహో, రాధే శ్యామ్ రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత వస్తున్న ప్యాన్ ఇండియా మూవీ. అసలే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ. అవుట్ ఫుట్ ఏ మాత్రం అటుఇటు అయినా ఈసారి ట్రోలింగ్ భీభత్సంగా ఉంటుంది. అడిగిన ప్రతిసారి ఓం రౌత్ గట్టి భరోసానే ఇస్తున్నాడు. ట్రైలర్ కట్ అయినా పర్ఫెక్ట్ గా ఉంటే అంచనాలను ఎగబాకేలా చేయొచ్చు. ప్రస్తుతానికైతే టీజర్ కొచ్చిన విమర్శలను సీరియస్ గా తీసుకున్న ఆది పురుష్ టీమ్ వాటి మీద బలంగా వర్క్ చేస్తోంది. వర్కౌట్ అయితే మంచిదేగా
This post was last modified on October 27, 2022 8:10 pm
ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ…
పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి…
గ్రామ పంచాయతీలపై జనసేన పార్టీ పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలను…
అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…
హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…
అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…