Movie News

మెడికల్ మాఫియాతో యశోద యుద్ధం

హీరో పక్కన ఆడి పాడే రెగ్యులర్ సినిమాలు కాకుండా ఏదో ఒక విలక్షణత ఉంటేనే ఒప్పుకుంటున్న సమంతా కొత్త సినిమా యశోద వచ్చే నెల 11న విడుదల కానుంది. ఎక్కువ హడావిడి లేకుండా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీకి భారీ రిలీజ్ ప్లాన్ చేశారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. 90ల నాటి క్లాసిక్ ఆదిత్య 369తో మొదలుకుని నాని జెంటిల్ మెన్ దాకా ఎన్నో చిత్రాలు నిర్మించిన ఈయన దీనికి ఎక్కువ బడ్జెట్టే ఖర్చు చేశారు. ప్రమోషన్ మొదలుపెట్టినప్పటి నుంచి దీని మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం మొదలయ్యింది. ఇవాళ ట్రైలర్ దాన్ని ఇంకో లెవెల్ కు తీసుకెళ్లింది.

యశోద కాన్సెప్ట్ సరోగసి అంటే అద్దె గర్భం మీద రాసుకున్నారు. ఇటీవలే నయనతార విగ్నేష్ సంతానం విషయంలో ఇది ఏకంగా కోర్టులు, కమిషన్ విచారణ అంటూ చాలా దూరం వెళ్ళింది. అయితే వీళ్ళ వివాహం అయిదేళ్ల క్రితమే జరిగిందని కమిటీ నిర్ధారించడంతో శుభం కార్డు పడింది. ఇది సుఖాంతమే కానీ ఇలాంటి వ్యవహారాల్లోని చీకటి కోణాన్ని యశోదలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకులు హరి అండ్ హరీష్. అవసరం కోసం గర్భాన్ని అద్దెకిచ్చే మహిళలు దేశవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. పుట్టే బిడ్డ ఎవరికి చేరుతుందో కూడా తెలియనంత రహస్యంగా ఈ దందా జరిగిపోతుంది.

దీని వెనుక కోట్ల రూపాయల మాఫియా సొమ్ము చేతులు మారుతుంది. వైద్య సేవ పేరుతో చేసే ఈ వ్యాపారం చాటున డాక్టర్లే కాదు రాజకీయ నాయకులు కూడా ఉంటారు. వాటిని పసిగట్టిన యశోద చుట్టూ విష వలయం ఏర్పడుతుంది. దాన్నెలా తప్పించుకుని ప్రపంచానికి ఈ చీకటిని పరిచయం చేసిందనేదే ఈ సినిమా కథ. మణిశర్మ సంగీతం, ఎం సుకుమార్ ఛాయాగ్రహణం, అశోక్ ఆర్ట్ వర్క్ ఇలా సాంకేతిక విభాగాన్ని బలంగా సెట్ చేసుకున్న యశోద బృందం రెగ్యులర్ కథను చెప్పడం లేదనే క్లారిటీ అయితే ఇచ్చింది. ఓ బేబీని మించి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేస్తున్న సామ్ కు ఈసారి ఫలితం ఎలా ఉండనుందో

This post was last modified on October 27, 2022 6:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాతో నాకే పోటీ అంటున్న అఖండ విలన్

ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ…

6 minutes ago

బాధను మాయం చేసే ‘స్మృతి’ సీక్రెట్!

పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి…

19 minutes ago

పంచాతీయ స్వ‌`రూపం`పై జ‌న‌సేన ఎఫెక్ట్ ..!

గ్రామ పంచాయ‌తీల‌పై జ‌న‌సేన పార్టీ ప‌ట్టు బిగించే దిశ‌గా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక స‌దుపాయాల‌ను…

59 minutes ago

ట్రంప్ గోల్డ్ కార్డ్.. టాలెంట్ ఉంటే సరిపోదు..

అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…

1 hour ago

ఆ రాష్ట్రంలో 400 మంది చిన్నారులకు HIV

హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…

2 hours ago

ఆఖరి నిమిషంలో ఆగిపోయిన అన్నగారు

అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…

2 hours ago