ఒక మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా కామెడీకి తిరుగులేని రారాజుగా కొనసాగాడు బ్రహ్మానందం. ఆయన స్టార్ కమెడియన్ అయ్యాక చాలామంది కమెడియన్లు వచ్చారు వెళ్లారు. బాబూ మోహన్, ఎమ్మెస్ నారాయణ, సునీల్, వేణుమాధవ్ లాంటి కమెడియన్లు బ్రహ్మానందంకు గట్టి పోటీనిచ్చారు. కానీ బ్రహ్మానందం స్థానం మాత్రం ఎప్పుడూ చెక్కు చెదరలేదు. కెరీర్లో అప్పుడప్పుడూ కొంచెం డౌన్ అయినట్లు కనిపించినా.. మళ్లీ బలంగా పుంజుకుని తన హవాను చూపించాడు బ్రహ్మి.
ఇక సోషల్ మీడియా ఊపు మొదలయ్యాక బ్రహ్మి పాపులారిటీ ఇంకా పెరిగింది. కెరీర్ పీక్స్‌ను అందుకున్నాడాయన. కానీ కొన్నేళ్ల కిందట్నుంచి ఈ నవ్వుల రారాజుకు పెద్దగా కలిసి రావట్లేదు. ఉన్నట్లుండి సినిమాలు తగ్గిపోయాయి. చూస్తుండగానే ఫేడవుట్ అయిపోయాడు బ్రహ్మి. ఇక మళ్లీ బ్రహ్మిని సినిమాల్లో చూడలేమా అనే పరిస్థితి వచ్చింది.
ఐతే ఇటీవల మళ్లీ బ్రహ్మి కొంచెం పుంజుకుంటున్నాడు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇంతకుముందులా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు పడకపోయినా.. మళ్లీ కొంచెం బిజీ అయితే అవుతున్నారు. ఇటీవలే అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల్లో తనదైన శైలిలో ప్రసంగించి నవ్వించిన బ్రహ్మి.. తాజాగా కృష్ణవంశీ సినిమా ‘రంగమార్తాండ’ డబ్బింగ్ పని మొదులపెట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
మామూలుగా నిలబడి డబ్బింగ్ చెబుతుంటారు కానీ.. బ్రహ్మి మాత్రం చక్కగా సింహాసనం లాంటి కుర్చీలో కాళ్లు మడిచి కూర్చుని భలేగా ఫన్నీగా కనిపిస్తున్నాడు. ఇది చూసి డబ్బింగ్ ఇలా కూడా చెప్పొచ్చా.. బ్రహ్మి స్టైలే వేరు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘రంగమార్తాండ’లో బ్రహ్మి కొంచెం సీరియస్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on October 27, 2022 3:22 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…