టాలీవుడ్లో అత్యధిక హైప్ తెచ్చుకున్న సినిమాల్లో ‘శక్తి’ కచ్చితంగా ఉంటుంది. అదే సమయంలో టాలీవుడ్లో అతి పెద్ద డిాజాస్టర్లలో కూడా దాన్నొకటిగా చెప్పొచ్చు. సినిమా రిలీజై దశాబ్దం దాటినా ఇప్పటికీ ‘శక్తి’ తాలూకు చేదు జ్ఞాపకాలను తారక్ అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. ఇక ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగిందో లెక్కే లేదు.
ఈ సినిమా రిలీజై పదేళ్లు పూర్తయిన సందర్భంగా తారక్ అభిమానులు సైలెంటుగా ఉంటే యాంటీ ఫ్యాన్స్ మాత్రం హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రోల్ చేశారు. దర్శకుడు మెహర్ రమేష్ పతనం ఈ సినిమాతోనే మొదలైంది. దీని తర్వాత ‘షాడో’ కూడా డిజాస్టర్ అవడంతో చాలా ఏళ్ల పాటు అతను మరో సినిమాను దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడేదో మెగాస్టార్ చిరంజీవి దయచూపి అతడికి రీమేక్ మూవీ అయిన ‘భోళా శంకర్’ తీసే ఛాన్స్ ఇచ్చాడు.
ఐతే సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్న మెహర్.. అంతకంటే ముందు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. తాజాగా అతను ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ‘శక్తి’ పరాజయం తాలూకు కారణాలు చెప్పాడు. నిజానికి తాను ‘శక్తి’ సినిమాను ‘మిషన్ ఇంపాజిబుల్’ స్టయిల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తీయాలని అనుకున్నట్లు మెహర్ చెప్పాడు.
తాను అశ్వినీదత్, ఎన్టీఆర్‌లకు ముందు చెప్పిన కథ కూడా వేరని.. ఐతే దత్ తనకు యండమూరి వీరేంద్రనాథ్, గంధం నాగరాజు లాంటి ఉద్దండులైన రచయితల్ని ఇచ్చారని.. వారు వచ్చాక కథలోకి భక్తి కోణం వచ్చిందని.. అక్కడే సినిమా దెబ్బ తిందని మెహర్ తెలిపాడు. తాను కథను ఇలా మార్చడం బాగుండదని చెప్పినా, పాత కథే చేద్దామని చెప్పినా అశ్వినీదత్ వినలేదన్నట్లు మెహర్ మాట్లాడాడు. ఈ సినిమా విడులదకు వారం ముందే ఇది ఆడదని తనకు తెలిసిపోయిందని మెహర్ తెలిపాడు. ‘శక్తి’కి బడ్జెట్, బిజినెస్ పరంగా బాగానే వర్కవుటైందని.. కానీ థియేటర్లలోకి సినిమా వచ్చాక పరిస్థితి మారిపోందని అతనన్నాడు.
This post was last modified on October 27, 2022 10:06 am
ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ…
పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి…
గ్రామ పంచాయతీలపై జనసేన పార్టీ పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలను…
అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…
హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…
అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…