టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమాలేవి సౌండ్ చేయలేకపోతున్నాయి. ప్రతీ వారం రెండు మూడు తెలుగు సినిమాలు రిలీజవుతున్నా వాటిలో ఒక్కటి కూడా బెస్ట్ కలెక్షన్స్ అందుకోలేకపోతున్నాయి. దీంతో తెలుగులో డబ్బింగ్ సినిమాలదే హవా కనిపిస్తుంది. గత వారం కన్నడ సినిమా ‘కాంతార’ తెలుగులో ఓ రేంజ్ కలెక్షన్స్ రాబట్టి ఔరా అనిపించింది. తక్కువ థియేటర్స్ ఉన్నప్పటికీ ఈ వారం కూడా కాంతార స్ట్రాంగ్ గానే ఉంది. అయితే కన్నడ మార్కెట్ కంటే కొన్ని చోట్ల కాంతార తెలుగు డబ్బింగ్ ఎక్కువ వసూళ్ళు తెచ్చిపెడుతుంది.
ఇక ఈ వారం కూడా డబ్బింగ్ సినిమానే హవా చూపిస్తుంది. కార్తి తమిళ్ సినిమా ‘సర్దార్’ తెలుగులో అదే టైటిల్ తో రిలీజైంది. ఈ సినిమా కంటెంట్ బాగుందనే టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. చాలా చోట్ల దీపావళి కి ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు సినిమాలు ఓరి దేవుడా , జిన్నా లు అంతంత మంత్రంగానే ఉన్నాయి. ఓరి దేవుడా కలెక్షన్స్ పరంగా పరవాలేదనిపించుకుంటుంది అంతే. ఇక మరో డబ్బింగ్ సినిమా ప్రిన్స్ కూడా దీపావళి వసూళ్ళు పంచుకుంటుంది.
ఏదేమైనా స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తే ప్రేక్షకులు డబ్బింగ్ సినిమా అనే ఆలోచనతో థియేటర్స్ వెళ్లరు. బాగుంది అంటే చాలు చూసేందుకు వస్తున్నారు. ఇప్పుడే కాదు తెలుగులో చాలా సార్లు డబ్బింగ్ సినిమాలు మంచి కలెక్షన్స్ తెచ్చుకొని హవా చాటుకున్నాయి. అందుకే కోలీవుడ్ హీరోలంతా తెలుగు మార్కెట్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఇక్కడ పాగా వేసేందుకు చూస్తున్నారు.
ఏదేమైనా తెలుగు ఫిలిం మేకర్స్ కూడా అద్భుతమైన కంటెంట్ తో విజువల్స్ ట్రీట్ ఇచ్చే సినిమాలు తీస్తే తప్ప భారీ వసూళ్ళు అందుకోవడం కష్టమే. మరి తెలుగులో కాంతార . సర్దార్ హవా ఎప్పటి వరకూ కొనసాగుతుందో ? ప్రస్తుతం వీటి కలెక్షన్స్ ను బీట్ చేసే తెలుగు సినిమా ఎప్పుడొస్తుందో ?
This post was last modified on October 26, 2022 3:20 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…