ప్రభాస్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు అతడి కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్ రిలీజైంది. అనుకున్నట్లే ఇది పూర్తి స్థాయి ప్రేమకథ అనే విషయాన్ని సూచించేలా ఫస్ట్ లుక్‌ను తీర్చిదిద్దారు. ఐతే ప్రభాస్ సినిమా అంటే ఉన్న హైప్‌కు తగ్గట్లయితే ఫస్ట్ లుక్ లేదన్నది స్పష్టం.
డిజాస్టర్ అయిన ‘సాహో’ సినిమాకు కూడా ప్రోమోలు వదిలినపుడు ఓ రేంజ్ హైప్ కనిపించింది. కానీ ‘రాధేశ్యామ్’ విషయంలో అలాంటి హంగామా ఏమీ కనిపించడం లేదు. సినిమాపై అంచనాలు పెంచేలా అయితే ఫస్ట్ లుక్ లేదు. జనాలు ఎక్కువ చర్చించుకునేలా.. స్పెషల్ అనిపించేలా అయితే లుక్ లేదు.
అన్నింటికీ మించి ఫస్ట్ లుక్ ‘ఒరిజినల్’ అనిపించేలా లేదు. అందులో చాలా వరకు ఫొటోషాప్ వర్క్ ఉండటంతో ఒరిజినాలిటీ మిస్ అయింది. ఇన్నాళ్లు ఊరించి ఊరించి ఇలాంటి లుక్కా వదిలేది అన్న వ్యాఖ్యలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.
ఫస్ట్ లుక్‌కు సంబంధించి ఫొటో షాప్ వర్క్‌లోనూ అంతగా పనితనం పనితనం కనిపించలేదు. ప్రభాస్ చేతి వేళ్ల దగ్గర గమనిస్తే ఈ వర్క్ ఎంత పూర్ అనే విషయం స్పష్టమైపోతుంది. చూపుడు వేలు మరీ లావుగా, కృత్రిమంగా కనిపిస్తోంది. ఆ వేళ్లకు ఫొటో షాప్ టచ్ ఇచ్చిన విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. అక్కడ అసలేమాత్రం సహజత్వం లేదు. రఫ్‌గా ఉన్న వేళ్లను నునుపుతేల్చే ప్రయత్నంలో కృత్రిమంగా తయారు చేశారు.
ఇలాంటి పెద్ద సినిమా ఫస్ట్ లుక్ అంటే.. జనాలు అణువణువునా శోధిస్తారు. చిన్న లోపం ఉన్నా ఎలివేట్ అయిపోతుంది. ఓవరాల్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్ ఏమంత ఎగ్జైటింగ్‌గా లేదు. ఇందులో సహజత్వం లోపించడం పెద్ద మైనస్ అయింది. దీని బదులు ఏ ఫొటో షాప్ వర్క్ లేకుండా క్లోజప్‌లో హీరో హీరోయిన్ల ఒరిజినల్ లుక్స్‌తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
This post was last modified on July 10, 2020 4:50 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…