సీమ టపాకాయ్, అవును సహా పలు తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించిన మలయాళ హీరోయిన్ పూర్ణ. ముస్లిం అయిన ఆమె అసలు పేరు షమ్మ ఖాసిమ్ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు పూర్ణగానే పరిచయం. సినిమాల్లో అవకాశాలు తగ్గాక బుల్లితెరపై దృష్టిసారించి అక్కడ పలు షోల్లో దర్శనం ఇస్తున్న పూర్ణ.. కొన్ని నెలల కిందట పెళ్లి వార్తతో మీడియా దృష్టిని ఆకర్షించింది.
షానిద్ అసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను పెళ్లాడబోతున్నట్లు స్వయంగా పూర్ణనే వెల్లడించింది. నిశ్చితార్థం తర్వాత పెళ్ళికి ఎక్కువ గ్యాప్ రావడంతో పూర్ణ నిజంగానే షానిద్‌ను పెళ్లాడుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. పెళ్లి రద్దయినట్లు కూడా పుకార్లు షికారు చేశాయి. కానీ ఈ ఊహాగానాలకు తెరదించుతూ పూర్ణ అతణ్నే పెళ్లాడింది. దుబాయిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పూర్ణ-షానిద్‌ల పెళ్లి వైభవంగా జరిగింది.
పెళ్లి అనంతరం పూర్ణ స్వయంగా ఫొటోలు రిలీజ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో పూర్ణ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ‘‘నేను ఈ ప్రపంచంలో అత్యంత అందమైన మహిళను కాకపోవచ్చు. అలాగే ఒక మంచి భార్యకు ఉండాల్సిన మంచి లక్షణాలన్నీ నాకు లేకపోవచ్చు. కానీ నేను ఎవ్వరికీ తక్కువ కాదని నేను ఫీలయ్యేలా నువ్వు చేశావు. నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం లేకుండా నేను నేనుగా ఉండేలా నువ్వు చూసుకున్నావు. అందుకే నేను నా పనిని స్వేచ్ఛగా చేసుకుంటూ నా అత్యుత్తమ ప్రతిభను బయటపెట్టుకోగలుగుతున్నాను. ఈ రోజు మన బంధువులు, సన్నిహితుల సమక్షంలో నీతో అద్భుత ప్రయాణాన్ని మొదలుపెడుతున్నా. ఎలాంటి సమయంలో అయినా నేను నీతో తోడు ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా’’ అంటూ భర్తను ఉద్దేశించి ఆమె ఈ పోస్టులో పేర్కొంది.
This post was last modified on October 25, 2022 11:41 am
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…
తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం…
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే…
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…