ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురించి పరిచయం అక్కర లేదు. సినిమాలైనా, రాజకీయాలైనా…బండ్ల గణేష్ చేసే కామెంట్లు కాక రేపుతుంటాయి. ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న బండ్లన్న…రాజకీయాలకు చాలా దగ్గరవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక, సినిమా తీస్తే పెద్ద హీరోతో..భారీ బడ్జెట్ తో తీస్తానని చెబుతుండే బండ్లన్న ఏం చేసిన కింగ్ సైజ్ లో చేయాలంటాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం దీపావళి సందర్భంగా బండ్లన్న టపాసుల కోసం భారీగా ఖర్చుపెట్టాడు.
అంతేకాదు, ఆ టపాసుల ఫొటో నెట్టింట వైరల్ కావడంతో…బండ్లన్నపై నెటిజన్లు సెటైర్లు కూడా వేశారు. టపాసుల కొట్టేమన్నా పెట్టావా అన్నా అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. అయినా సరే తగ్గేదేలే అన్న రీతిలో ఈ ఏడాది కూడా దీపావళి సందర్భంగా బండ్లన్న భారీగా డబ్బు ఖర్చుపెట్టి టపాసులు కొన్నాడు. అంతేకాదు, ఎంత మొత్తానికి టపాసులు కొన్నారు అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు…బండ్లన్న జవాబివ్వడం కొస మెరుపు.
మొత్తం 4 లక్షల 20 వేల రూపాయలకు క్రాకర్స్ కొన్నానంటూ బండ్లన్న చెప్పిన వైనం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. తన మిత్రులకు గిఫ్ట్ లుగా క్రాకర్స్ పంపిస్తుంటానని బండ్లన్న చెప్పాడు. ఈ ఏడాది తాను కొన్న టపాసుల ఫొటోను బండ్ల గణేష్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. తన సొంతూరు షాద్ నగర్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి టపాసులతో బండ్ల దిగిన ఫొటో వైరల్ గా మారింది. దీంతో, క్రాకర్స్ కే క్రాక్…బండ్ల గణేషా..మజాకా?.. అట్లుంటది బండ్లన్నతోని అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా బండ్ల గణేష్ టపాసుల ఖర్చు ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
This post was last modified on October 25, 2022 12:17 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…