అసలేం జరుగుతోందో అంతు చిక్కడం లేదు. ఇప్పటికే సంక్రాంతి పోటీకి డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్ల బుర్రలు వేడెక్కిపోతుండగా తాజాగా ఏజెంట్ కూడా అదే పండక్కు రిలీజ్ చేస్తామని నిర్మాతలు కొత్త పోస్టర్ విడుదల చేయడం టపాసులు కాల్చకుండానే మంటలు పుట్టిస్తోంది. ఆది పురుష్ లేదా మిగిలిన మూడింట్లో ఒకటి వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో హఠాత్తుగా ఈ అనౌన్స్ మెంట్ రావడం అసలు ట్విస్ట్. ఎందుకంటే అయిదో సినిమాకు ఆ సీజన్లో స్పేస్ దొరకడం కష్టం. ఏదోలా రిలీజ్ చేయొచ్చు కానీ సరిపడా స్క్రీన్లు దొరకడం ముమ్మాటికీ అసాధ్యం.
అసలే ఏజెంట్ ప్యాన్ ఇండియా మూవీ. అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు. పైగా మమ్ముట్టి కీలక పాత్ర చేయడంతో కేరళలోనూ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో చిరంజీవి బాలకృష్ణ విజయ్ ప్రభాస్ లాంటి సీనియర్ మోస్ట్ స్టార్లతో అఖిల్ మొదటి సారి చేస్తున్న యాక్షన్ గ్రాండియర్ ని దింపడం రిస్క్ అవుతుంది. పైగా ఇలాంటివి సోలోగా వస్తేనే బెటర్. ఎంత జనాలు ఎక్కువ సినిమాలు చూసే మూడ్ లో ఉన్నా మరీ ఇన్నేసి వస్తే లేనిపోని కన్ఫ్యూజన్ కి తావిచ్చి దాని వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి. నిర్మాత అనిల్ సుంకర ఏ ప్లాన్ తో ఇలా డిసైడ్ చేశారో చూడాలి.
ఊహించని ఈ షాక్ కి అక్కినేని ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. వాళ్ళ హీరోలకు బాగా కలిసి వచ్చిన డిసెంబర్ లో పెద్దగా కాంపిటేషన్ లేదు కాబట్టి ఆ టైంలో వస్తే బెటరని వాళ్ళ అభిప్రాయం. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఏజెంట్ షూటింగ్ ఇంకా బాలన్స్ ఉంది. ఎంతనేది బయటికి చెప్పడం లేదు కానీ దర్శకుడు సురేందర్ రెడ్డి డిసెంబర్ మొదటి వారానికి ఫినిష్ చేస్తానని మాటిచ్చారట. అలాంటప్పుడు అదే నెలలో థియేటర్లలో దింపడం సాధ్యం కాదు. టీజర్ తప్ప ఇప్పటిదాకా ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ రాలేదు. మరి ఏజెంట్ ఎందుకు ఝలక్ ఇచ్చాడబ్బా
ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ…
పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి…
గ్రామ పంచాయతీలపై జనసేన పార్టీ పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలను…
అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…
హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…
అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…