Movie News

ప్ర‌భాస్ ఫ్యాన్స్.. ఇది త‌గునా?

స్టార్ హీరోల పుట్టిన రోజులు, ఇంకేవైనా స్పెష‌ల్ డేల‌కు పాత సినిమాల‌ను రీ రిలీజ్ చేసుకుని అభిమానులు హంగామా చేయ‌డం బాగానే ఉంది. ఈ సెల‌బ్రేష‌న్లు చూసి వారెవా అనుకుంటున్నారు. ఐతే ఆ సంబ‌రాలు మ‌రీ శ్రుతి మించి పోతుండ‌డ‌మే ఆందోళ‌న క‌లిగిస్తోంది.

పోకిరి సినిమాకు కాకినాడ‌లోని ఒక థియేట‌ర్‌కు స్పెష‌ల్ షో వేసిన సంద‌ర్భంగా విధ్వంసం జ‌రిగి ఇక‌పై ఇలాంటి స్పెష‌ల్ షోలు వేయ‌కూడ‌ద‌ని అక్క‌డి ఎగ్జిబిట‌ర్లు నిర్ణ‌యం తీసుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది.

ఆ త‌ర్వాత జ‌ల్సా సినిమా విష‌యంలోనూ కొన్ని థియేట‌ర్ల‌లో ఇలాగే జ‌రిగింది. థియేట‌ర్ల‌ను దారుణంగా దెబ్బ తీశారు. విశాఖ‌లోని ఒక థియేట‌ర్‌లో సీట్ల‌న్నీ ధ్వంస‌మ‌య్యాయి. స్క్రీన్ కూడా దెబ్బ తింది. ఆ థియేట‌ర్ య‌జ‌మాని ఈ విష‌యంలో తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

ఆ అనుభ‌వాలు చూశాక అయినా మిగ‌తా హీరోల అభిమానులు మారుతారేమో అనుకుంటే అలాంటిదేమీ జ‌ర‌గ‌ట్లేదు. తాజాగా ప్ర‌భాస్ అభిమానులు ఇలాగే హ‌ద్దులు దాటారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెంలో బిల్లా మూవీ స్పెష‌ల్ షో సంద‌ర్భంగా అభిమానులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు.

థియేట‌ర్ లోపల ట‌పాకాయ‌లు పేల్చే క్ర‌మంలో థియేట‌ర్‌కు నిప్పు పెట్టేశారు. సీట్ల‌కు నిప్పంటుకుని భీతావ‌హ ప‌రిస్థితి నెల‌కొన‌డంతో అభిమానులు భ‌య‌ప‌డి పారిపోయారు. థియేట‌ర్ సిబ్బంది వ‌చ్చి మంట‌లార్ప‌డంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది. ఒక‌వేళ మంట‌లు విస్త‌రించి థియేట‌ర్ త‌గ‌ల‌బ‌డిపోతే ఏంటి ప‌రిస్థితి.

కోట్ల‌ల్లో న‌ష్టం త‌ప్పేది కాదు. ఇక ప్రాణ‌న‌ష్టం జ‌రిగి ఉంటే దారుణంగా ఉండేది. ఇలాంటి ఉదంతాలు ఈ స్పెష‌ల్ షోల విష‌యంలో అంద‌రూ పున‌రాలోచ‌న‌లో ప‌డేలా చేస్తున్నాయి.

This post was last modified on October 23, 2022 8:19 pm

Share

Recent Posts

నక్క తోక తొక్కిన కామెడీ నక్సలైట్

మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…

8 minutes ago

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

44 minutes ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

1 hour ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

2 hours ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

2 hours ago

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

3 hours ago