సినిమా పర్లేదు , బాగానే ఉంది అనిపించుకుంటే సరిపోదు… థియేటర్స్ కి ప్రేక్షకులను రప్పించే స్టామినా కూడా హీరోకి అవసరం. తాజాగా కుర్ర హీరో విశ్వక్ సేన్ కి అలాంటి సమస్యే ఎదురవుతుంది. దీపావళి స్పెషల్ గా నాలుగు సినిమాలతో కలిసి విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ రిలీజైంది. విక్టరీ వెంకటేష్ మోడ్రన్ గాడ్ గా కనిపించిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు అశ్వత్ దర్శకత్వం వహించాడు. తమిళ్ లో సూపర్ హిట్టైన ‘ఓ మై కడవులే’ కి రీమేక్ గా తెరకెక్కింది. ఇక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ రీమేక్ కలెక్షన్స్ లో ఆ జోరు చూపించడం లేదు.
వీకెండ్ పైగా దీపావళి ఫెస్టివల్ ఇలా అన్ని కలిసొచ్చినా సినిమా ఆశించిన రెవెన్యూ రాబట్టలేకపోతుంది. విశ్వక్ సేన్ నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ కి కూడా ఇదే జరిగింది. సినిమా బాగుంది అనే టాక్ అందుకున్న అది థియేటర్స్ లో గట్టిగా పెర్ఫాం చేయలేకపోయింది. ఒటీటీ లో కి వచ్చాక జనాలు బాగానే చూశారు కానీ థియేటర్స్ కి మాత్రం కదలలేదు.
సో విశ్వక్ సేన్ హీరోగా డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ మంచి కంటెంట్ ఆడియన్స్ ముందుకొస్తున్నప్పటికీ ఈ కుర్ర హీరోకి థియేటర్స్ లో ఆశించిన ఫలితం మాత్రం అందడం లేదు. మరి దివాలి నుండి సినిమా పికప్ అయితే ఓ మోస్తరు కలెక్షన్స్ తో అందరూ సేఫ్ అవుతారు. వెంకటేష్ కూడా ఉన్నాడు కాబట్టి ఫెస్టివల్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. మరి ఫైనల్ రన్ లో విశ్వక్ ఓరి దేవుడా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
This post was last modified on October 23, 2022 3:21 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…