అల్లు శిరీష్ హీరోగా రాకేశ్ దర్శకత్వంలో ‘ఊర్వసివో రాక్షసివో’ అనే సినిమా వస్తుంది. ముందుగా ఈ సినిమాకి ‘ప్రేమ కాదంట’ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు టైటిల్ మార్చుకున్నారు. నవంబర్ 4న రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాకు శిరీష్ రంగంలో దిగి ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఇంటర్వ్యూలు , టూర్లు ఫినిష్ చేశాడు. ఇక మిగిలింది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కటే. దాని కోసమే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వారంలో హైదరాబాద్ లో ఈవెంట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణను గెస్ట్ గా పిలిచే ప్లానింగ్ లో ఉన్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ బాలయ్య తో ఓ మాట అనేసి సిగ్నల్ అందుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య కి అల్లు కుటుంబానికి మధ్య మంచి అనుబంధం కొనసాగుతుంది. అల్లు అరవింద్ ‘ఆహా’లో బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తున్నాడు. బాలయ్య ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా విచ్చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇటు నుండి అటు అటు నుండి ఇటు రాకపోకలు మొదలయ్యాయి. అందుకే ఇప్పుడు శిరీష్ కోసం బాలయ్య గెస్ట్ గా రాబోతున్నాడని సమాచారం.
అఖండ ఈవెంట్ కి వచ్చిన అల్లు అర్జున్ కోసం ఇప్పుడు బాలయ్య ‘ఊర్వసివో రాక్షసివో’ ఈవెంట్ కి గెస్ట్ అవ్వనున్నాడట. ప్రస్తుతం బాలయ్య ని దృష్టిలో పెట్టుకొని ఈవెంట్ ను భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో డీటెయిల్స్ బయట పెట్టి ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. మరి అల్లు శిరీష్ గురించి బాలయ్య ఈవెంట్ లో ఏం మాట్లాడతారో అల్లు కుటుంబం గురించి ఇంకా ఏం చెప్తారో వేచి చూడాల్సిందే.
This post was last modified on October 23, 2022 3:14 pm
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…