Movie News

మోహన్ లాల్‌కు బిగ్ షాక్

మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్ మోహన్ లాలే అని చెప్పక తప్పదు. మమ్ముట్టి కూడా లాల్‌కు ఏమాత్రం తీసిపోని సూపర్ స్టారే కానీ.. వసూళ్ల పరంగా మాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నెలకొల్పేది.. బద్దలు కొట్టేది లాలెట్టనే. ‘దృశ్యం’తో తొలి 50 కోట్ల మూవీని.. ‘పులి మురుగన్‌’తో తొలి 100 కోట్ల మూవీని మలయాళ సినీ పరిశ్రమకు అందించింది మోహన్ లాలే. ‘లూసిఫర్’తో కొన్నేళ్ల కిందట ‘పులి మురుగన్’ రికార్డులను కూడా లాల్ బద్దలు కొట్టాడు. బడ్జెట్ల విషయంలోనూ లాల్ ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను టచ్ చేస్తుంటాడు.

ఐతే ఆయనకు ‘లూసిఫర్’ తర్వాత వరుసగా బాక్సాఫీస్ దగ్గర షాకులు తగులుతున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన బిగ్ బ్రదర్, మరక్కార్, ఆరట్టు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇందులో ‘మరక్కార్’ వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా. బాహుబలికి దీటైన సినిమాగా మలయాళ సినీ పరిశ్రమ ప్రమోట్ చేసిన ఈ చిత్రం విడుదలకు ముందే జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది కానీ.. థియేటర్లలో రిలీజయ్యాక ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. ఈ ఏడాది భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఆరట్టు’ కూడా తుస్సుమనిపించింది.

దృశ్యం-2, బ్రో డాడీ, ట్వల్త్ మ్యాన్ లాంటి చిత్రాలు ఓటీటీలో విడుదలై మంచి స్పందనే తెచ్చుకున్నప్పటికీ.. థియేట్రికల్ రిలీజ్‌తో లాల్ హిట్ కొట్టి చాన్నాళ్లయింది. లాల్‌తో ‘పులి మురుగన్’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన వైశాఖ్.. ఆయనతో తీసిన ‘మాన్‌స్టర్’ ఆ కోరిక నెరవేరుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. పూర్ ఓపెనింగ్స్‌తో తీవ్రంగా నిరాశ పరుస్తోంది. గత కొన్నేళ్లలోఅతి తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న లాల్ చిత్రంగా ‘మాన్‌స్టర్’ నిలుస్తోంది.

తొలి రోజు కనీసం ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడలేదు. ట్రైలర్‌తోనే తీవ్రంగా నిరాశ పరిచిన ఈ సినిమా లాల్ అభిమానులకే రుచించట్లేదు. ఓవైపు మమ్ముట్టి వరుసగా బ్లాక్‌బస్టర్లు ఇస్తుంటే.. లాల్ ఇలా వరుస ఫ్లాపులతో వెనుకబడిపోతుండడం అభిమానులను బాధిస్తోంది. ఇక తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బరోజ్’తో అయినా లాల్ పుంజుకుంటాడేమో అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

This post was last modified on October 23, 2022 3:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

10 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

11 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

12 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

12 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

12 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

13 hours ago