డార్లింగ్ ఫ్యాన్స్ కు అక్టోబర్ 23 అంటే మాములు సంబరం కాదు. తమ అభిమాన హీరో పుట్టినరోజుని చాలా గొప్పగా సెలెబ్రేట్ చేసుకోవడం ప్రతి ఏడాది జరిగేదే. ఈసారి బిల్లా 4కె స్పెషల్ షోలతో పాటు కొత్త సినిమాల అప్డేట్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ సందర్భంగా కొన్ని అరుదైన వీడియోలు బయటికి వస్తున్నాయి. అందులో మున్నా ఓపెనింగ్ ఒకటి. 2007లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ దిల్ రాజు ప్రొడక్షన్ లో అయిదో చిత్రం. విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా గ్రాండ్ ఓపెనింగ్ చేశారు. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
దిల్ రాజు ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు ముందు వినిపించిన కథ ఆర్య. అలాంటి లవ్ స్టోరీ తనకు సూట్ అవుతుందో లేదో పైగా కొత్త దర్శకుడు సుకుమార్ అనే మీమాంసలో ఎక్కువ టైం గడిచిపోవడంతో అది కాస్తా అల్లు అర్జున్ కు వెళ్లిపోయింది. గంగోత్రిలో నటనకు వచ్చిన కామెంట్స్ కి సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్న ఐకాన్ స్టార్ కు అది సూపర్ బ్రేక్ ఇచ్చింది. తర్వాత భద్ర స్టోరీ నెరేషన్ ఇప్పించారు. ఇక్కడా ప్రభాస్ డైలమాలో పడ్డాడు. బోయపాటి శీనుకీ ఇది డెబ్యూ మూవీ. ఫ్యాక్షన్ డ్రామా ఎందుకులెమ్మని అదీ వద్దనుకున్నారు. కట్ చేస్తే మున్నా టైం వచ్చింది.
ఈసారి దిల్ రాజు మరో కొత్త కుర్రాడు వంశీ పైడిపల్లితో చెప్పించిన లైన్ ప్రభాస్ కు నచ్చేసింది. దుర్మార్గుడైన తండ్రి మీద కొడుకు తీర్చుకునే రివెంజ్ డ్రామా పర్ఫెక్ట్ అని భావించాడు. కట్ చేస్తే చకచకా షూటింగు మొదలైపోయింది. తీరా చూస్తే బాక్సాఫీస్ వద్ద మున్నా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ప్రభాస్ చాలా స్టయిలిష్ గా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసినా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఎస్విసి బ్యానర్ కు నష్టాలు తప్పలేదు. ఒకవేళ ఆర్య చేసుంటే ఎలా ఉండేదోనన్న ఊహ డిఫరెంట్ గా అనిపిస్తోంది. రవితేజకు వెళ్లిన భద్రను ఓకే చేసినా మిర్చి కన్నా ముందే పవర్ ఫుల్ హిట్టు పడేది. కొన్నిసార్లు అలా జరిగిపోతాయి.
This post was last modified on October 22, 2022 9:24 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…