కొన్ని సినిమాలు అందర్నీ గాట్టిగానే టచ్ చేస్తాయ్. అలా ప్రస్తుతం కంటెంట్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తున్న సినిమా ‘కాంతారా’. ఒక మారుమూల ట్రైబల్ విలేజ్ లో ఉన్న ఒక దేవత లేదా దేవుని గురించి కథ చెబితే ఎవరు చూస్తారు అని చాలామంది హీరోలూ నిర్మాతలూ ఇటువంటి కథలే టచ్ చెయ్యరు. కాని అలాంటి కథను కూడా ఎంటర్టయిన్మెట్ జోడించి ఒక థ్రిల్లర్ తరహాలో నెరేట్ చేస్తే ఎలా ఉంటుంది చేసి చూపించాడు హీరో-డైరక్టర్ రిషబ్ షెట్టి. అందుకే ఇప్పుడు మనోడ్ని ఇండియాలో అసలు పొగడని నోరంటూ కనిపించట్లేదు.
కాంతారా సినిమా చూసిన తరువాత స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మైండ్ బ్లాంక్ అయిపోయిందట. ఈ సినిమాను చూశాక అస్సలు హీరో అండ్ డైరక్టర్ ను ఎప్రిషియేట్ చెయ్యకుండా ఉండలేకపోతున్నానంటూ అమ్మడు సోషల్ మీడియాలో సెలవిచ్చింది. అంతే కాదు, అసలు ఈ సినిమా తాలూకు ఎఫెక్ట్ నుండి రికవరీ అవ్వడానికి ఏకంగా ఓ వారంరోజులు పడుతుందని కూడా చెప్పింది. పైగా తను కూడా డైరక్షన్ చేస్తూ హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు చేసింది కాబట్టి, అలాంటి రెండు పనులూ తామే చేస్తూ హిట్టు కొట్టడం ఎంత కష్టమో ఆమెకు బాగా తెలుసు. అందుకేనేమో కాంతారా సినిమా గురించి చాలా స్పెషల్ గా చెబుతోంది. మరి రికవర్ అయిన తరువాత ఈ తరహా సినిమా ఏమన్నా అమ్మడు ప్లాన్ చేస్తుందేమో చూడాలి.
ఇకపోతే అప్పట్లో కార్తికేయ2 సినిమా హిందీలో చాలా పెద్ద హిట్టే అయ్యింది. దానితో పోల్చిచూస్తే కాంతారా సినిమాకు కలక్షన్లు ఇంకాస్త పికప్ అవ్వాల్సిందే. కాకపోతే హిందీలో మాత్రం అస్సలు ప్రచారం అనేదే లేకుండా కాంతారా రెచ్చిపోతోంది. పైగా చుట్టూ చాలా పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాలు ఉన్నా కూడా.. కాంతారా మాత్రం మొదటివారంలోనే ₹15 కోట్ల నెట్ కలక్షన్ కొల్లగొట్టేసింది. చూస్తుంటే తెలుగు అండ్ హిందీలో కలిపి ఎలాగైనా నిర్మాతలకు ఓ 30 కోట్లు ఈజీగా ప్రాఫిట్ వచ్చేలా కనిపిస్తోంది.
This post was last modified on October 21, 2022 4:55 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…