టాలీవుడ్లో నిర్మొహమాటంగా మాట్లాడే నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. ఐతే ఏ విషయం మీదైనా ఓపెన్‌గా మాట్లాడే ఆయన కఠినత్వం అయితే ప్రదర్శించరు. వేదికల మీద చాలా వరకు సరదాగానే మాట్లాడతారు. అలా సరదాగానే అవతలి వాళ్ల మీద పంచ్‌లు వేసేస్తారు. తాజాగా ఆయన తన నిర్మాణంలో తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్‌కు చురకలంటించారు.
గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఒక హోటల్లో ఈ సినిమా ప్రమోషనల్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రోగ్రాం మొదలుపెట్టే సమయానికి హీరో అల్లు శిరీష్, నిర్మాత అల్లు అరవింద్ సహా యూనిట్లో ప్రధాన సభ్యులందరూ వచ్చేశారు. కానీ కథానాయిక అను ఇమ్మాన్యుయెల్ మాత్రం అక్కడ కనిపించలేదు. ప్రెస్ మీట్ మొదలుపెట్టి ముందుకు నడిపిస్తుంటే ఆమె వస్తుందిలే అని ముందుకెళ్లిపోయారు.
కానీ అందరూ మాట్లాడేస్తున్నా, ప్రెస్ మీట్ చివరికి వస్తున్నా అను అక్కడ కనిపించలేదు. అల్లు అరవింద్ మైక్ అందుకుని మాట్లాడుతుండగా.. వేదికలోకి అడుగు పెట్టింది అను. ఆమెను గమనించిన అరవింద్.. సినిమా ప్రస్తావన పక్కన పెట్టి అనుకు స్వాగతం పలికాడు. ఈవెంట్ ఇక ముగియబోతుండగా అను వచ్చిందని, ఇంకాసేపు అయితే ఈవెంట్ అయిపోయేదని నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఆమె స్టేజ్ మీదికి చేరుకున్నాక కూడా ఈ విషయాన్ని ఆయన వదిలిపెట్టలేదు. ఆమె దగ్గరికి వచ్చి తనకు సమాచారం ఇచ్చిన వ్యక్తిదే తప్పు అని, టైం తప్పు చెప్పాడని అరవింద్‌కు సమాచారం ఇచ్చింది.
ఐతే ఆ వ్యక్తి పేరు ప్రస్తావిస్తూ నీదే తప్పంట, నువ్వే టైమింగ్ సరిగా చెప్పలేదంట అని అరవింద్ అన్నారు. హీరో హీరోయిన్లు ఏం చెప్పినా కరెక్ట్, నాదే తప్పు అని చెప్పాలి. అదే ఇక్కడ రూల్. తెలుసు కదా అంటూ ఆయన పరోక్షంగా ఇలా లేటుగా వచ్చే హీరో హీరోయిన్లందరికీ కౌంటర్ ఇచ్చారు. కానీ వ్యవహారం సీరియస్ అవకుండా సరదాగా మాట్లాడడంతో ఆ టాపిక్ అక్కడితో ఎండ్ అయిపోయింది.
This post was last modified on October 21, 2022 8:49 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…