అడపాదడపా హిట్లున్నా భారీ సంఖ్యలో ఫ్లాపులే ఎక్కువ చూసిన సందీప్ కిషన్ కు మొదటి ప్యాన్ ఇండియా మూవీ మైఖేల్. మొన్నటిదాకా పెద్దగా అంచనాలేం లేవు ట్రైలర్ చూశాక మాత్రం నమ్మకం కలిగించేలానే ఉంది. అలా అని ఎప్పుడూ టచ్ చేయని జానరేం కాదు. మాఫియా రౌడీయిజం షేడ్స్ లో సాగినప్పటికీ టేకింగ్ లో మంచి ఇంటెన్సిటీతో పాటు పర్ఫెక్ట్ క్యాస్టింగ్ ఆసక్తి రేపెలా ఉంది. యాక్షన్ ఎంటర్ టైనరని క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ గా పెట్టుకోకుండా విక్రమ్ తరహాలో ప్రత్యేక వర్గం ప్రేక్షకులను మైఖేల్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.
పేరుకు టీజర్ లెన్త్ చిన్నదే ఉన్నప్పటికీ కంటెంట్ మాత్రం సాలిడ్ గా అనిపిస్తోంది. పైగా దీని లాంచ్ ఈవెంట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ ఇది హిట్ కాకపోతే ఇక తాను ఇండస్ట్రీలో కొనసాగడమే కరెక్ట్ కాదన్న రీతిలో మాట్లాడ్డం చూస్తే ఆ నమ్మకం వెనుక బలమైన కారణమే కనిపిస్తోంది. మజిలీ, రామారావు ఆన్ డ్యూటీ ఫేమ్ దివ్యంశ కౌశిక్ హీరోయిన్ గా నటించగా ఫెరోషియస్ లుక్ లో విజయ్ సేతుపతి మరోసారి పవర్ ఫుల్ క్యారెక్టర్ దక్కించుకున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ, అయ్యప్ప శర్మ ఇలా భారీ తారాగణాన్ని సెట్ చేసుకున్నాడు.
మైఖేల్ కి దర్శకుడు రంజిత్ జయకోడి. ఇతను మనకు పరిచయం లేదు కానీ తమిళంలో ఇలాంటివే మూడు విలక్షణమైన సినిమాలతో పేరు తెచ్చుకున్నాడు. వాటిలో ఒకటి పిజ్జా 2 పేరుతో తెలుగులో డబ్ చేశారు కానీ ఇక్కడెవరూ పట్టించుకోలేదు. మొత్తానికి మైఖేల్ లో మ్యాటర్ ఉందనే క్లారిటీ అయితే ఇచ్చారు. తనకు సూట్ కాని కథలతో ఇప్పటిదాకా ఏవేవో చేసుకుంటూ వచ్చిన సందీప్ కి దీని సక్సెస్ చాలా కీలకం. పైగా మల్టీ లాంగ్వేజెస్ లో విడుదలవుతుంది కాబట్టి ఏ మాత్రం అటుఇటు అయినా ఇబ్బందే. రిలీజ్ ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఏంటో ఈ మధ్య అందరూ ఇంటెన్స్ డ్రామాల మీద పడుతున్నారు.
This post was last modified on October 21, 2022 6:32 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…