ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మీద కొంత ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మెగా స్టార్ అతిథిగా విచ్చేసే సినిమాల మీద యాంటీ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. చిరు గెస్ట్ గా వస్తే ఆ సినిమా సక్సెస్ కష్టమే అంటూ తీవ్రమైన కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే వీటికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు రామ్ చరణ్ తనకున్న సెంటిమెంట్ బయట పెట్టాడు.
ఇటివల రాజమండ్రిలో జరిగిన ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన చరణ్ ఆ టీంను అభినందిస్తూ ఒక లక్కీ సెంటిమెంట్ గురించి చెప్పాడు. ఉప్పెన సినిమా ఫంక్షన్ కూడా రాజమండ్రిలోనే జరిగిందని ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిందని ఇప్పుడు ఓరి దేవుడా కూడా అంతటి విజయం అందుకోవాలని ఆశిస్తున్నానని అన్నాడు. దీంతో రామ్ చరణ్ గెస్ట్ గా వస్తే సినిమా సక్సెస్ అవుతుందనే సెంటిమెంట్ అందరిలో బలపడింది.
మరి ఓరి దేవుడా మంచి సక్సెస్ సాదిస్తే మెగా స్టార్ బ్యాడ్ సెంటిమెంట్ మర్చిపోయి రామ్ చరణ్ లక్కీ సెంటిమెంట్ హైలైట్ అవుతుంది. ఇకపై రామ్ చరణ్ ని చిన్న సినిమాలకు గెస్ట్ గా తీసుకురావడం మీద మిగతా యంగ్ హీరోలు ఫోకస్ పెడతారనిపిస్తుంది. మరి విశ్వక్ సేన్ సినిమాకు చరణ్ చెప్పిన సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ? చూడాలి.
ఓమై కడవులే అనే తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో నటించాడు. అన్ని కార్యక్రామాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పీవీపీ సినిమా నిర్మించిన ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. సినిమా మీద కొంత బజ్ అయితే ఉంది మరి బాక్సాఫీస్ దగ్గర పోటీ నడుమ ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో..?
This post was last modified on October 21, 2022 6:28 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…