ఈ శుక్రవారం తెలుగులో నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ ఒకటి. ఈ సినిమాలో వెంకటేష్ మోడరన్ గాడ్ కేరెక్టర్ లో కనిపించనున్నాడు. అయితే సినిమాలో కీలక పాత్ర పోషించిన వెంకీ ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు. దీని గురించి తాజాగా హీరో విశ్వక్ ను ఇంటర్వ్యూలో మీడియా ప్రశ్నించగా క్లారిటీ ఇచ్చాడు.
వెంకటేష్ గారు ముంబైలో సల్మాన్ ఖాన్ గారితో హిందీ సినిమా షూట్ లో ఉన్నారని.. ఆ కారణంగానే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోయారని.. అందుకే స్పెషల్ గా బైట్ చెప్పి పంపారని తెలిపాడు. వెంకటేష్ గారు కేవలం నాలుగు రోజులు మాత్రమే షూట్ లో పాల్గొన్నారని.. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నాని అన్నాడు. నేను సినిమా సైన్ చేసినప్పుడు దేవుడి పాత్ర కి వెంకటేష్ గారి పేరు ఉంది.
కానీ మధ్యలో ఒకరిద్దరిని అనుకొని ఫైనల్ గా మళ్ళీ వెంకటేష్ గారే చేయాల్సి వచ్చింది. ఈ రోల్ ఆయనకే రాసిపెట్టుందని అనిపించిందన్నాడు. ఇక బాలయ్య గారితో అన్ స్టాపబుల్ షో లో పాల్గొనడం కిక్ ఇచ్చిందని విశ్వక్ చెప్పాడు. ఆయన షో లో మేన్షన్ హౌజ్ గురించి అడగాలని ఎప్పుడో ఫిక్సయ్యానని అందుకే ఆయన కలుద్దాం అనగానే వెంటనే అలా అనేశానని చెప్పాడు.
అలాగే షో స్టార్ట్ అయ్యే ముందు అరగంట టెన్షన్ తో ప్యాక్ అయ్యిందని కానీ తర్వాత ఆయన కూల్ గా మాట్లాడటంతో అంతా నార్మల్ గా అనిపించిందని చెప్పాడు. నాలుగు రిలీజ్ లు కాంపిటీషన్ గురించి కూడా విశ్వక్ రియాక్ట్ అయ్యాడు. దీపావళి కి ఎన్ని వచ్చినా బాగుంటే ఆడియన్స్ చూస్తారని మొన్నీ మధ్యే బింబిసార – సీతారామం రెండు ఒకే రోజు రిలీజై బాగా ఆడాయని గుర్తుచేశాడు. తన సినిమా అయితే బాగుందని కచ్చితంగా హిట్ అవుతుందనే ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on October 20, 2022 8:18 pm
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…