కొన్ని సినిమాలకు సంబంధించి టైటిల్ ఎనౌన్స్ మెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. అలా ప్రస్తుతం టైటిల్ ఎనౌన్స్ మెంట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా NBK107. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా టైటిల్ ప్రకటించలేదు. ఇప్పటి వరకూ #NBK107 అనే వర్కింగ్ టైటిల్ తోనే సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
ఇక టైటిల్ ఎనౌన్స్ మెంట్ వెయిటింగ్ కి రేపటితో చెక్ పడబోతుంది. రేపు దీపావళి సందర్భంగా టైటిల్ ఎనౌన్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అలాగే రిలీజ్ డేట్ కూడా చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు ‘అన్నగారు’, ‘రెడ్డి గారు’, వీర సింహా రెడ్డి’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇవన్నీ చక్కర్లు కొడుతున్నాయి.
అయితే వీటిలో బాలయ్య పవర్ ఫుల్ యాక్షన్ సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారనేది మాత్రం ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లో పడేసింది. ఎప్పుడూ లీకులకు తావిచ్చే మైత్రి మూవీ మేకర్స్ ఈ టైటిల్ గురించి ఎక్కడా లీకులు లేకుండా చూసుకుంటుంది. దీంతో సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేశారన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. టీం కూడా టైటిల్ విషయంలో కన్ఫ్యూజన్ లో ఉన్నారని తెలుస్తుంది. అనుకున్న టైటిల్స్ తో పోస్టర్స్ రెడీ చేసి ఓటింగ్ పెట్టారట.
అయితే ఎక్కువ మంది ‘వీర సింహా రెడ్డి’ కి ఓటేశారని టాక్. బాలయ్య మాత్రం ఇంకా తన డిసిషన్ చెప్పలేదట. ఇవ్వాళ ఓ ముహూర్తం చూసి వీటిలో ఒకటి సెలెక్ట్ చేస్తారని తెలుస్తుంది. మరి బాలయ్య అండ్ టీం ఏ టైటిల్ కి మొగ్గు చూపుతారో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. ఫర్ ది ఫస్ట్ టైం కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయబోతున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి కొండారెడ్డి బురుజు దగ్గర బాలయ్య ఏ టైటిల్ తో గర్జిస్తారో వేచి చూడాలి.
This post was last modified on October 20, 2022 12:52 pm
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్…