జపాన్ లో ఆర్ఆర్ఆర్ విడుదల సందర్భంగా దాన్ని అక్కడ ప్రమోట్ చేయడం కోసం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఆ దేశానికి వెళ్లిపోయారు. రాజమౌళితో పాటు అక్కడి ఈవెంట్లలో, థియేటర్ ఎక్స్ పీరియన్స్ లలో భాగం కాబోతున్నారు. మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నారు. ఇక్కడ రిలీజై ఏడు నెలలు దాటుతున్నా ఇంకా ఆ సినిమా కోసమే కష్టపడాల్సి రావడం ఇద్దరు హీరోల అభిమానులకు ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే RC 15 సినిమా ఆగుతూ సాగుతూ షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో సమాంతరంగా దర్శకుడు శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 చేయాల్సి రావడమే ప్రధాన కారణం.
ఇక తారక్ కొరటాల శివ కాంబో నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్తుందనే లీక్ తప్ప ఎలాంటి అధికారిక సమాచారం లేదు. స్క్రిప్ట్ విషయంలో ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదన్న వార్తే ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా తిరుగుతోంది. ఇప్పుడు జక్కన్న టార్గెట్ ఆస్కార్ సాధించడం. భవిష్యత్తులో మళ్ళీ ఇది సాధ్యమవుతుందో లేదో చెప్పలేం కానీ అంతర్జాతీయంగా గొప్ప నటులు సాంకేతిక నిపుణలతో శభాష్ అనిపించుకున్న తరుణంలో ఇలాంటి అవకాశాన్ని వదులుకోకూడదు. క్యాంపైన్ కోసం కోట్లాది రూపాయలు అవసరమే అయినప్పటికి దానికి రాజమౌళి సిద్ధపడే రంగంలోకి దిగారట.
ఒకవేళ ఆర్ఆర్ఆర్ కనక నిజంగా జెనరల్ క్యాటగిరీలో కనక అవార్డులు సాధిస్తే అది మాములు అచీవ్ మెంట్ కిందకు రాదు. చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోతుంది. రాజమౌళికి దేశవ్యాప్తంగా నీరాజనాలు అందుతాయి. బాహుబలి టైంలోనూ ఈ స్థాయి రెస్పాన్స్ చూడలేదు కాబట్టి ఆర్ఆర్ఆర్ ని వీలైనంత విపరీత స్థాయిలో గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ చేయడాన్నే ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. సో చరణ్ తారక్ లు ఇందులో భాగమవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు. లక్కీగా ఇతరత్రా కారణాల వల్ల ఇద్దరి కాల్ షీట్లు అందుబాటులో ఉన్నాయి కానీ లేదంటే వాటి షూటింగులు ఆపాల్సిన పరిస్థితి వచ్చేది. మొత్తానికి ఆస్కార్ ఈవెంట్ జరిగే దాకా ఈ ఆర్ఆర్ఆర్ ది అంతులేని ప్రయాణమే
This post was last modified on October 19, 2022 11:37 am
గ్రామ పంచాయతీలపై జనసేన పార్టీ పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలను…
అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…
హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…
అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…
భారీ అంచనాల మధ్య ఓ పెద్ద హీరో సినిమా రిలీజైందంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. ఐతే ఈ…
గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…