ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవడమనేది సినిమా పరిశ్రమకు ఎక్కువగా వర్తిస్తుంది. అందుకే ఎంత పెద్ద ఫ్లాప్ వచ్చినా సరే మళ్ళీ హిట్టు కొట్టకపోతామా అనే నిర్మాతలు ఉండటం వల్లే ప్రతి వారం బాక్సాఫీస్ కళకళలాడుతోంది. మొన్న దసరా పండక్కు భారీ అంచనాల మధ్య రిలీజైన నాగార్జున ది ఘోస్ట్ ఎంత పెద్ద డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనీస స్థాయిలో ఆడుతుందనుకుంటే అంచనాలను ఏ మాత్రం మ్యాచ్ చేయలేక ఫైనల్ రన్ కు వచ్చేసింది. అంత పాజిటివ్ టాక్ వచ్చిన గాడ్ ఫాదరే అయిదు రోజుల తర్వాత డౌన్ అయినప్పుడు ఘోస్ట్ నుంచి ఆశించేది ఏముంటుంది.
దీని నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావులు ఇతరత్రా డబ్బింగ్, శాటిలైట్ డీల్స్ లో ఎంత సేఫ్ అయ్యారనేది పక్కన పెడితే బయ్యర్లకు థియేట్రికల్ గా మాత్రం భారీ నష్టాలే వచ్చాయి. అందుకే ఇప్పుడు దాన్ని ప్రిన్స్ భర్తీ చేయాలనే నమ్మకంతో సదరు ప్రొడ్యూసర్లున్నారు. సురేష్ సంస్థ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందిన ప్రిన్స్ కు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహించడం మరీ భారీ అంచనాలు రేపలేదు కానీ ఎంటర్ టైన్మెంట్ కనక సరిగ్గా పండితే హిట్టు కొట్టే సూచనలున్నాయి. కానీ ట్రైలర్ వచ్చాక హైప్ ఆశించిన స్థాయిలో పెరగలేదు.
నిన్న విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ముగిసింది. ద్విబాషాల్లో తీశామని చెబుతున్నప్పటికీ ప్రిన్స్ లో డబ్బింగ్ ఫ్లేవరే ఎక్కువగా కనిపిస్తోంది. దానికి క్యాస్టింగ్ కూడా ఒక కారణం. తమన్ సంగీతం చార్ట్ బస్టర్ స్థాయిలో ఇంకా కనెక్ట్ కాలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బ్రిటిష్ అమ్మాయి పాత్రను హీరోయిన్ గా చేయడం మాస్ ని ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి. అసలే ఓరి దేవుడా, సర్దార్, జిన్నా, బ్లాక్ ఆడమ్ లతో పాటు కాంతారతో కూడా పోటీ పడాల్సిన టఫ్ సిచువేషన్ లో ప్రిన్స్ దిగుతున్నాడు. తెలుగు మార్కెట్ పెంచుకునే టార్గెట్ తో ఉన్న శివకార్తికేయన్ ఎలాంటి ఫలితం దక్కనుందో.
This post was last modified on October 19, 2022 11:25 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…