ఈ వారం ఏకంగా ఒకటి రెండు కాదు నాలుగు తెలుగు సినిమాలు ఒక ఇంగ్లీష్ మూవీ బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాయి. ఓరి దేవుడా మీద మంచి అంచనాలున్నాయి. సర్దార్ ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి. ప్రిన్స్ దాని దర్శకుడు అనుదీప్ బ్రాండింగ్ తో వస్తోంది కానీ చెప్పుకోదగ్గ బజ్ అయితే లేదు. శివ కార్తికేయన్ రెండు హిట్లు కొట్టినా ఇక్కడతని మార్కెట్ ఇంకా బలపడలేదు. ఇక జిన్నా టీమ్ చాలా హడావిడి చేస్తోంది కానీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలగాలంటే మొదటి షోకు ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. ముందస్తుగా ఏమీ చెప్పలేం మంచు విష్ణు కాన్ఫిడెన్స్ మాత్రం పీక్స్ లో కనిపిస్తోంది.
ఇక బ్లాక్ ఆడమ్ సంగతి సరేసరి. సిటీస్ లో గట్టి ఓపెనింగ్స్ దక్కబోతున్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ పండగను టార్గెట్ చేసుకుని బరిలో దిగుతున్న ఈ టపాసులకు కాంతార కొంత టెన్షన్ పెడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తో దీని దూకుడు మాములుగా లేదు. కేవలం వారం రోజులకే తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో సింగల్ స్క్రీన్ సోమవారం సెకండ్ షోకు హౌస్ ఫుల్ కావడం చాలా అరుదు. అందులోనూ స్టార్ హీరో లేని ఒక డబ్బింగ్ సినిమాకు. కానీ కాంతార ఇది చేసి చూపించింది. ట్రేడ్ సైతం నివ్వెరపోతోంది.
ఒకవేళ ఈ దూకుడు కనక సెకండ్ వీక్ కంటిన్యూ చేస్తే ఇబ్బందే. పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది మరి. మూడో రోజు నెమ్మదించాల్సింది పోయి పికప్ కావడం అనూహ్యం. ఇప్పుడే ఇలా ఉంటే రెండో వీకెండ్ లో మళ్ళీ రచ్చ ఉంటుంది. సో దీపావళి సినిమాలకు టాక్ చాలా కీలకంగా మారనుంది. దసరాలాగా ఈ పండక్కు ఎక్కువ సెలవులు ఉండవు. స్కూళ్ళు కాలేజీలు సైతం ఒక్క రోజే హాలిడే ఇస్తాయి. అందుకే ఫెస్టివల్ 24 అయితే మూడు రోజులు ముందే కొత్త కంటెంట్ రావడం థియేటర్లకు మంచిదే. మరి కాంతారని ఓవర్ టేక్ చేసేంత విషయం వీటిలో ఉందా చూద్దాం
This post was last modified on October 18, 2022 8:15 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…