Movie News

తమిళ డైరెక్టర్లకు అఖిల్ ఛాన్స్

ప్రస్తుతం ఏజెంట్ విడుదల కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ ఆశలు దాని మీద మాములుగా లేవు. కెరీర్లో మొదటిసారి లవర్ బాయ్ పాత్రలను పక్కనపెట్టి పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ చేయడమే కాదు ప్యాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందించడంతో ఫ్యాన్స్ సైతం దర్శకుడు సురేందర్ రెడ్డి మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. డిసెంబర్ విడుదల ఎలాగూ సాధ్యం కాదు కనక సంక్రాంతి రేస్ నుంచి ఏదైనా పెద్ద సినిమా తప్పుకుంటే దాని స్థానంలో ఏజెంట్ ని దించేందుకు నిర్మాత అనిల్ సుంకర రెడీ అవుతున్నారన్న వార్త ఆల్రెడీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక Akhil నెక్స్ట్ చేయబోయే లిస్టులో ఇద్దరు తమిళ డైరెక్టర్లు ఉండటం దాదాపు ఖాయమైనట్టే. అందులో మొదటి వ్యక్తి మోహన్ రాజా. ఇటీవలే గాడ్ ఫాదర్ రూపంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ రీమేక్ స్పెషలిస్ట్ నాగార్జున అఖిల్ కాంబో కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. నాగ్ వందో సినిమాగా తీసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. రెండో వ్యక్తి పిఎస్ మిత్రన్. విశాల్ తో అభిమన్యుడు తీసిన దర్శకుడితను. తెలుగులోనూ బాగా ఆడిన బొమ్మది. ఈ 21న కార్తీతో సర్దార్ ని తేబోతున్నాడు. ట్రైలర్ చూశాక దీని మీదా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇతను అఖిల్ కోసం ఓ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.

ఇవి ఓకే అయితే ఇంకో ఏడాదిన్నర అక్కినేని కుర్రాడు బిజీ అయిపోతాడు. కాకపోతే ఈ రెండు అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ ఇంకొంత కాలం వేచి చూడాలి. అఖిల్ ఆలోచన ఒకరకంగా కరెక్టే. ఎందుకంటే ఫామ్ లో ఉన్న టాలీవుడ్ డైరెక్టర్లందరూ వాళ్ళ వాళ్ళ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. ఎదురు చూసి టైం వేస్ట్ చేయడం కంటే సక్సెస్ ట్రాక్ లో కోలీవుడ్ దర్శకులను నమ్ముకోవడం మంచిదే. వచ్చి అయిదేళ్ళు దాటినా ఇంకా బ్లాక్ బస్టర్ అందుకోలేక వెయిట్ చేస్తున్న అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్టే కానీ ఆశించిన పెద్ద రేంజ్ లో వెళ్ళలేదు కాబట్టి ఏజెంట్ విజయం చాలా కీలకం.

This post was last modified on October 18, 2022 8:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ అందుకే ఆలోచిస్తున్నాడు

ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…

31 minutes ago

“జానీ ఫలితం పవన్ కి ముందే అర్థమైపోయింది” : అల్లు అరవింద్

ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…

56 minutes ago

సందీప్ వంగా చుట్టూ ‘మెగా’ కాంబో పుకార్లు

ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…

1 hour ago

40 అడుగుల బావిలో పడ్డ భర్తను రక్షించిన 56 ఏళ్ల భార్య

అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…

2 hours ago

పాత వ్యూహమే: ఎమ్మెల్సీ ఎన్నికలకు గులాబీ పార్టీ దూరం

కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…

2 hours ago

స్కూటర్ మీద 311 కేసులు.. రూ.1.6లక్షల ఫైన్!

ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…

2 hours ago