రెండేళ్ల కిందట మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన అయ్యప్పనుం కోషీయుం సినిమా రీమేక్ హక్కులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా తీసేసుకుంది సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. ఇక అప్పట్నుంచి ఈ సినిమా లీడ్ రోల్స్ కోసం నటీనటులతో పాటు ఎంపిక ప్రక్రియ మొదలైంది. కానీ ఈ విషయం ఎంతకీ తేలలేదు.
ఒరిజినల్లో పృథ్వీరాజ్ చేసిన పాత్రకు రానా దగ్గుబాటి త్వరగానే ఖాయం అయ్యాడు కానీ.. మరో పాత్రకు ఎవరనే విషయంలో సుదీర్ఘ కాలం సందిగ్ధత నడిచింది. నందమూరి బాలకృష్ణ, రవితేజ.. ఇలా చాలా పేర్లే వినిపించాయి. చివరికి ఆ స్థానంలోకి పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఆయన ఇమేజ్‌కు తగ్గట్లు కథాకథనాలు కూడా మారాయి. టైటిల్ కూడా పవన్ పాత్రను సూచించేలా భీమ్లా నాయక్ అని పెట్టారు. ఈ సినిమా పవన్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది. కమర్షియల్‌గానూ సినిమా బాగానే ఆడింది.
ఐతే పవన్ కాకుండా బాలయ్య ఈ పాత్ర చేసి ఉంటే సినిమా ఎలా ఉండేదన్న ఊహ ఆసక్తి రేకెత్తించేదే. ఇప్పుడు ఆ చర్చే నడుస్తోంది. బాలయ్య హోస్ట్ చేసే అన్ స్టాపబుల్ షోకు అతిథిగా వచ్చిన భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీని బాలయ్య ఓ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. భీమ్లా నాయక్ సినిమాకు ముందు ఎవరిని అడిగారు అని. ఈ ఎపిసోడ్ ప్రోమోలో నాగవంశీ స్పందన చూస్తే.. బాలయ్యను ఆ పాత్ర కోసం అడిగారని స్పష్టంగా తెలిసిపోయింది.
మరి పూర్తి వివరాలు ఎపిసోడ్ వచ్చినపుడే చూడాలి. మరి బాలయ్య ఎందుకు ఈ పాత్ర చేయలేదన్నది ఆసక్తికరం. మామూలుగా బాలయ్యకు రీమేక్‌ల పట్ల పెద్ద ఆసక్తి ఉండదు. మరి ఆ కారణంతో నో అన్నాడా లేక తన ఇమేజ్‌కు ఆ పాత్ర సెట్టవ్వదని అనుకున్నాడా.. లేక ఖాళీ లేక ఈ సినిమా చేయలేదా? చూద్దాం ఏం సమాధానం వస్తుందో?
This post was last modified on October 16, 2022 8:00 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…