రాబోయే శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాల్లో కాస్త ఎక్కువ బజ్ ఉన్నది ఓరి దేవుడాకే. కార్తీ సర్దార్ డబ్బింగ్ మూవీ కావడం, శివ కార్తికేయన్ ప్రిన్స్ దర్శకుడు తెలుగువాడే అయినప్పటికీ క్యాస్టింగ్ వల్ల అరవ ఫ్లేవర్ కనిపించడం, రెగ్యులర్ ట్రీట్ మెంట్ ఫీలింగ్ ని జిన్నా కలిగించడం లాంటి కారణాలు విశ్వక్ సేన్ కు ప్లస్ గా మారనున్నాయి. తమిళంలో ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టు అందులోనూ ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన అశ్వత్ మారిముత్తుకే దీని బాధ్యతలు అప్పజెప్పడంతో ఫలితం మీద టీమ్ చాలా నమ్మకంగా ఉంది. తాజాగా రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ అదే బయటపడింది.
ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అతిథిగా రావడం ఓరి దేవుడా మీద మెగా ఫ్యాన్స్ దృష్టి వెళ్లేలా చేసింది. శంకర్ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ కోసం అక్కడే ఉన్న చరణ్ కోసమే ఈ వేడుకను అక్కడ ప్లాన్ చేసినట్టు కనిపించింది. ఆర్ఆర్ఆర్ రామరాజు మాటల్లోనూ ఆ అర్థం వినిపించింది. తనకోసమే తండోపతండాలుగా వచ్చిన అభిమానులున్నారు. విశ్వక్ సేన్ ని చరణ్ బాగా మెచ్చేసుకుని చక్కగా పొగిడేశాడు. ముఖ్యంగా ఇచ్చిన మాటను తప్పో ఒప్పో నిలబెట్టాలని నేను కోరుకుంటానని అదే లక్షణంలో విశ్వక్ లోనూ కనిపించిందని, సూపర్ స్టార్ కు కావాల్సిన లక్షణం ఇదేనని చెప్పేశాడు.
ఈ స్థాయిలో మెప్పు ఊహించని విశ్వక్ స్టేజి మీద సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆల్రెడీ వెంకటేష్ చేస్తున్న టైటిల్ కం క్యామియో రోల్ తో ఓరి దేవుడాకు దగ్గుబాటి ఫ్యాన్స్ సపోర్ట్ ఫుల్లుగా దక్కింది. ఇప్పుడీ ఫంక్షన్ వల్ల చరణ్ ని అభిమానించే వాళ్లంతా మొదటి రోజే రాకపోయినా ఎంతో కొంత మైలేజ్ ఓపెనింగ్స్ పరంగా ఖచ్చితంగా వస్తుంది. విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఏ చిన్న పాజిటివ్ అంశమైనా సరే దాన్ని వాడుకోవడం చాలా అవసరం. ఓరి దేవుడా బృందం చేస్తోంది అదే. దీపావళి అడ్వాంటేజ్ ని దేవుడు శిష్యుడు కలిసి ఎలా వాడుకుంటారో
This post was last modified on October 16, 2022 7:58 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…